BigTV English
Advertisement

Weight-loss tea: బరువు త్వరగా తగ్గాలనుకుంటున్నారా? ఉత్తమ ఫలితాలు ఇచ్చే 5 రకాల టీలు ఇవిగో

Weight-loss tea: బరువు త్వరగా తగ్గాలనుకుంటున్నారా? ఉత్తమ ఫలితాలు ఇచ్చే 5 రకాల టీలు ఇవిగో

బరువు పెరిగే సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఐదు రకాల టీలు బరువు తగ్గడంలో, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో సమర్థవంతంగా సహాయపడతాయి. ఈ టీలలో ఫ్లేవనాయిడ్లు, కాటేచిన్లు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగ్గా మార్చి కొవ్వును కాల్చేస్తాయి. అలాంటి ఐదు రకాల టీలు ఏవో తెలుసుకోండి.


గ్రీన్ టీ
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది. అనేక పరిశోధనలు కూడా గ్రీన్ టీ ను ఆహారంలో భాగం చేసుకోమని చెబుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో శరీర బరువును, పొట్ట దగ్గర కొవ్వును తగ్గించే సామర్థ్యాన్ని గ్రీన్ టీ కలిగి ఉంది. వీటిని ఎనిమిది వారాలపాటు తాగి చూడండి. మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. గ్రీన్ టీ లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

బ్లాక్ టీ
రక్తంలో చక్కెర కొవ్వు ఆమ్లాల జీవక్రియను నియంత్రించడంలో బ్లాక్ టీ ఎంత సహాయ పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ వంద మందిపై ఒక అధ్యయనాన్ని మూడు నెలల పాటు చేసింది. అందులో ప్రతిరోజూ మూడు కప్పుల బ్లాక్ టీ ని వారికి ఇచ్చారు. వారికి వారు బరువు తగ్గడంలో విజయం సాధించారు. దీన్ని బట్టి బరువు తగ్గించే లక్షణాలు బ్లాక్ టీ కి ఉన్నాయని కనిపెట్టారు. ఇది ఈ బ్లాక్ టీ తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది.


ఊలాంగ్ టీ
ఊలాంగ్ టీ కొవ్వును కాల్చడంలో ముందుంటుంది. ఈ ఊలాంగ్ టీ కావాలంటే ఈ కామర్స్ సైట్లలో లభిస్తుంది. ఈ టీ మంచిదో కాదో తెలుసుకోవడానికి 102 మందిపై పరిశోధనలు చేశారు. వారంతా కూడా అధిక బరువు కలవారే. ఆరు వారాలపాటు ఊలాంగ్ టీ తాగాక వారి శరీర బరువులో తగ్గుదల కనిపించింది.

వైట్ టీ
టీ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే వాటి నుంచి ఆకుల్ని సేకరించి, ప్రాసెస్ చేసి ఈ వైట్ టీను తయారు చేస్తారు. వీటిలో అధిక స్థాయిలో కాటేచిన్లు ఉంటాయి. ఇవి కొవ్వు కణాల నిర్మాణాన్ని నిరోధిస్తాయి. కొవ్వు విచిన్నతకు సహాయపడతాయి. అందుకే వైట్ టీ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. త్వరగా బరువును తగ్గిస్తుంది.

Also Read: వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో.. పెట్టకూడదు తెలుసా ?

మందార టీ
ఊబకాయం నుండి రక్షించే సామర్థ్యం మందార టీకి ఉంది. అనేక హెర్బల్ టీలలో మందార టీ కూడా ఒకటి. ఈ టీ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. బరువు తగ్గడానికి ఎంతో సహకరిస్తుంది. అలాగే సమ్మతుల్య ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాల్సిన అవసరం ఉంది. పొట్ట దగ్గర కొవ్వు చేరుకుపోవడం అనేది చాలా ప్రమాదకరం. ఇది గుండె జబ్బులకు, అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. కాబట్టి పైన చెప్పిన ఆహారాలను తినడం ద్వారా, టీలను తాగడం ద్వారా బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Drinking Water: నీళ్లు తాగడం మానేస్తే శరీరం ఏమవుతుందో తెలుసా? నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు

Heart Attack: చిన్న వయసులోనే గుండెపోటు.. కారణం స్కూల్ బ్యాగ్ ఒత్తిడేనా?

Calcium Rich Fruits: కాల్షియం లోపమా ? ఈ ఫ్రూట్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !

Pomegranate: దానిమ్మ తింటున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Bluetoothing: బ్లూటూతింగ్.. ఎయిడ్స్‌కు కారణమవుతోన్న ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా? ఆ దేశమంతా నాశనం!

Bed Bugs: బెడ్ మీద నల్లులు నిద్రలేకుండా చేస్తున్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు!

Unhealthy Gut: మీలో ఈ లక్షణాలున్నాయా ? గట్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే !

Indian Sweets:15 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫేమస్ స్వీట్స్.. మరీ ఇంత సింపులా !

Big Stories

×