Racha Ravi:జబర్దస్త్ (Jabardast) కమెడియన్ రచ్చ రవి (Racha Ravi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమైన ఈ జబర్దస్త్ కామెడీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. తనదైన కామెడీ పంచ్ డైలాగ్లతో విపరీతంగా క్రేజ్ దక్కించుకున్నారు. ఇక అలా వచ్చిన క్రేజ్ తోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రచ్చ రవి. ఇటీవలే ‘బాపు’ సినిమాలో కూడా అలరించిన ఈయన.. అందులో కీలక పాత్ర పోషించి, అటు నటుడిగా కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈయన.. తాజాగా తన పెళ్లిరోజు కావడంతో తన భార్యకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడమే కాకుండా తన భార్యపై ప్రశంసలు కురిపిస్తూ ఒక సుదీర్ఘ నోట్ వదిలారు.
వడ్డీగా నైనా నీరుణం తీర్చుకుంటా- రచ్చ రవి
ఇక రచ్చ రవి తన పోస్టులో తన భార్య గురించి మాట్లాడుతూ..” ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనంటూ కామెంట్లు చేశారు.. నిన్ను నాకు పరిచయం చేసిన మన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరనిది.. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్నా నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. ఇష్టాలు.. కోరికలు ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలను లేదో అని ఎప్పుడు నేను అడగలేదు. నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్వెల వెలుగును పంచుతూ.. నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ.. కష్టాలను భరిస్తూ.. దుఃఖాలను దిగమింగుకుంటూ.. కాంప్రమైజ్ అవుతూ లైఫ్ లో నన్ను సక్సెస్ చేయిస్తూ.. ఇదే జీవితంలో నీ ఇష్టాలు, కోరికలు, ఆశలను తీర్చాలని, అంత శక్తి భగవంతుడు నాకు ఇవ్వాలని, నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని భగవంతుడు ఆ శక్తి ఇస్తాడని, నీ రుణం కూడా తీరదని తెలిసినా కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని, ప్రేమగా చూసుకుంటానని నా సహచరి ఐ లవ్ యు స్వాతి” అంటూ ఒక పోస్ట్ వదిలారు రచ్చ రవి. ఇది చూసిన అభిమానులు రచ్చ రవికి తన భార్య అంటే ఇంత ప్రేమ ఉందా? అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి అయితే రచ్చ రవి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Bollywood Actor: సమంత లేకుంటే ఇదంతా సాధ్యం కాదు.. బాలీవుడ్ నటుడు..!
రచ్చరవి కెరియర్..
రచ్చ రవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీవీ నటుడు. ఆ తర్వాత సినిమా నటుడిగా మారిపోయారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. 2013లో వచ్చిన ‘1000 అబద్దాలు’ సినిమాతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రలో కాసేపు కనిపించిన స్థాయి నుండి.. కథలో ప్రాధాన్యత వుండే పాత్రలు పోషించే స్థాయికి చేరుకున్నారు. అలా ‘గద్దలకొండ గణేష్’, ‘శతమానంభవతి’ సినిమాలలో తెలంగాణ , ఆంధ్ర యాసలో మాట్లాడి అలరించారు. ఇక రచ్చ రవి కాకతీయ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశారు.