డార్జిలింగ్.. పర్యాటకులకు పెద్దగా పరిచయం అసవరం లేని పేరు. పశ్చిమ బెంగాల్ లోని ఈ పర్యాటక ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. హిమాలయాలకు అడుగు భాగంలో ఉండే ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే, చాలా మంది టూరిస్టులు మార్చిలో డార్జిలింగ్ కు వెళ్తుంటారు. ఎందుకు ఆ నెలలోనే అక్కడికి వెళ్లాలి? మిగతా నెలలకు మార్చికి తేడా ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మార్చి నెలలో వసంత కాలం మరింత కనువిందు చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, వికసించే పువ్వులు, పర్వతాలు, లోయల సొగసు, శీతాకాలం నెమ్మదిగా వెళ్లిపోతూ, వేసవి ఎంట్రీ ఇస్తుంది. 6 డిగ్రీల సెల్సియస్ నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వరకు తేలికపాటి ఉష్ణోగ్రతలతో డార్జిలింగ్ మరింత ఆకట్టుకుంటుంది.
కాంచన్‌జంగా అద్భుతమైన దృశ్యాలు
వేసవి సమీపిస్తున్న వేళ ప్రపంచంలోని మూడవ ఎత్తైన పర్వతం కాంచన్ జంగా శ్రేణి అద్భుతకంగా కనిపిస్తుంది. టైగర్ హిల్ ప్రాంతం సూర్యోదయ సమయంలో కనువిందు చేస్తుంది. పర్వతం వైపు ఉన్న హోటల్ లేదంటే గెస్ట్ హౌస్‌లో బస చేస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు మీ గది నుంచే కాంచన్‌జంగా పర్వతం మీదుగా సూర్యోదయాన్ని చూసి మైమరచిపోవచ్చు.
వికసించే రోడోడెండ్రాన్లు, మాగ్నోలియా పువ్వులు
వసంతకాలంలో రోడోడెండ్రాన్లు, మాగ్నోలియాలు, ఆర్కిడ్లు పూర్తిగా వికసించి ఆకట్టుకుంటాయి. కొండలను ఎరుపు, గులాబీ, తెలుపు షేడ్స్ లో కనిపించేలా చేస్తాయి. ఈ పువ్వులు ప్రకృతికి మరింత శోభను అద్దుతాయి. సమీపంలోని సింగాలిలా నేషనల్ పార్క్, డార్జిలింగ్ లోని బొటానికల్ గార్డెన్ సైతం అందంగా ఆకట్టుకుంటాయి.
ఐకానిక్ డార్జిలింగ్ టాయ్ ట్రైన్
యునెస్కో జాబితాలోకి ఎక్కిన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే కొండలు, టీ తోటలు, అద్భుతమైన సౌందర్యాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తుంది. మార్చిలో డార్జిలింగ్ నుంచి ఘుమ్ వరకు అందమైన వాతావరణం ఆకట్టుకునేలా చేస్తుంది.
డార్జిలింగ్ టీ ఎస్టేట్లు
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డార్జిలింగ్ తేయాకు తోటల గురించి ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. మార్చి నెలలో విశాలమైన టీ తోటలు మరింత అందంగా కనిపిసత్ఆయి. మీకు ఇష్టమైన టీ పొడి ఎలా ప్రాసెస్ చేయబడుతుందో స్వయంగా చూసే అవకాశం ఉంటుంది. శీతాకాలం తర్వాత పచ్చని తోటలు వికసించడం ప్రారంభిస్తాయి. హ్యాపీ వ్యాలీ, మకైబారి వంటి ప్రసిద్ధ ఎస్టేట్ లలో పర్యటించి టీ ఆకులు కోయడాన్ని చూడవచ్చు.
టిబెటన్, నేపాలీ సంస్కృతి
డార్జిలింగ్ పర్వత దృశ్యాలు, చల్లని పర్వత గాలితో పాటు విభిన్న సాంస్కృతులు ఆకట్టుకుంటాయి. ఇక్కడి మఠాలు, దేవాలయాలు ఆధ్యాత్మికశోభను అందిస్తాయి. ఘూమ్ మొనాస్టరీ, యిగా చోలింగ్ మొనాస్టరీ, భూటియా బస్టీ మొనాస్టరీ ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తాయి. ఇక్కడి చౌరస్తా, మాల్ రోడ్ టిబెటన్ హస్తకళలు, ఉన్ని వస్త్రాలతో పాటు స్థానిక రుచికరమైన వంటకాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
Read Also: ఈ దేశాల్లో నగ్నంగా ఉండటం తప్పు కాదు, ఇండియాలోనూ ఆ కలర్చర్ ఉందని మీకు తెలుసా?
ట్రెక్కింగ్, అడ్వెంచరస్ ఈవెంట్లు
ట్రెక్కింగ్, సాహసాలను ఇష్టపడితే మార్చి మీకు సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ట్రెక్కింగ్, అవుట్ డోర్ అడ్వెంచరస్ కార్యక్రమాలకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోని నాలుగు ఎత్తైన పర్వతాలు అయిన ఎవరెస్ట్, కాంచన్ జంగా, లోట్సే, మకాలుతో పాటు అద్భుమైన దృశ్యాలను అందించే సందక్ ఫు ట్రెక్ లో అడ్వెంచర్ ఈవెంట్లకు వెళ్లవచ్చు.
Read Also: మహిళలూ.. సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్లేసెస్ ఇవే!