E-Paper
Advertisement

భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ పని చేస్తే సరి.. బంధం మరింత బలపడుతుంది

భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ పని చేస్తే సరి.. బంధం మరింత బలపడుతుంది
Advertisement

How to build a lasting marriage | భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటేనే వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని చాలామంది అనుకుంటారు. ఖరీదైన బహుమతులు, రొమాంటిక్ డేట్స్, కలిసి గడిపే సమయం కూడా బంధాన్ని బలపరుస్తాయి. కానీ, దాంపత్య జీవితాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోవడానికి మరో ముఖ్యమైన విషయం ఉందని రిలేషన్‌షిప్ పరిశోధనలు సూచిస్తున్నాయి. గొడవలు వచ్చినప్పుడు ఒకరినొకరు పట్టించుకోకుండా ఉండే జంటల కంటే, భావాలను అర్థం చేసుకునే జంటల బంధం బలంగా ఉండే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

నవంబర్ 8, 2026న డైలీ మెయిల్ ప్రచురించిన కథనం ప్రకారం.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఈ అంశాన్ని పరిశీలించారు. దశాబ్దాల రిలేషన్‌షిప్ పరిశోధనల ఆధారంగా రూపొందించిన గణిత నమూనాను ఉపయోగించారు. ప్రముఖ సంబంధాల పరిశోధకుడు జాన్ గాట్‌మన్ గుర్తించిన జంటల ప్రవర్తనా విధానాలను కూడా పరిశీలించారు.

1. భాగస్వామి భావాలు అర్థం చేసుకునే దంపతులు

Advertisement

జాన్ గాట్‌మన్ పరిశోధన ప్రకారం.. కొన్ని జంటలు గొడవలను పరిష్కరించుకునే విషయంలో మంచి అవగాహన ప్రదర్శిస్తారు. వీరిని వాలిడేటింగ్ కపుల్స్ అంటారు. ఇలాంటి జంటలు భాగస్వామి చెప్పే విషయాలు శ్రద్ధగా వింటారు. ఎదుటివారి భావాలను గౌరవిస్తారు. అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
వీరి మధ్య కూడా గొడవలు జరుగుతాయి. అయితే, సమస్య వచ్చినప్పుడు మాట్లాడకుండా దూరంగా ఉండరు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు.

2. గొడవలకు దూరంగా ఉండే దంపతుల బంధం ఇలా ఉంటుంది

కొంతమంది దంపతులు గొడవలు రాకుండా ఉండేందుకు అసలు సమస్యల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఇలాంటి వారిని కాన్ఫ్లిక్ట్ అవాయిడింగ్ కపుల్స్ (గొడవలకు దూరంగా ఉండే దంపతులు) అంటారు. వారు అసౌకర్యంగా అనిపించే విషయాలు చర్చించకుండా వదిలేస్తారు. దీంతో తాత్కాలికంగా గొడవలు తగ్గినప్పటికీ, అసలు సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఇలా పదేపదే సమస్యలు పట్టించుకోకపోతే భాగస్వామికి నిర్లక్ష్యానికి గురైన భావన కలగవచ్చు. క్రమంగా ఇద్దరి మధ్య భావోద్వేగ దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

3. మనోభావాలు స్పష్టంగా పంచుకునే జంటలు

Advertisement

వోలటైల్ కపుల్స్ అంటే తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరిచే దంపతులు. వీరి మధ్య గొడవలు కొన్నిసార్లు తీవ్రంగా ఉండవచ్చు. అయితే, సమస్య వచ్చినప్పుడు పూర్తిగా మౌనంగా ఉండరు. తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతారు. చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. గాట్‌మన్ పరిశోధనలో ఈ 3 రకాల జంటలు స్థిరమైన వైవాహిక బంధాల్లో కనిపించినట్లు వివరించారు.

భాగస్వామి బాధను గుర్తించడం ఎందుకు ముఖ్యం?

జాన్ గాట్‌మన్ 1993లో ‘జర్నల్ ఆఫ్ కన్సల్టింగ్ అండ్ క్లినికల్ సైకాలజీ’లో ప్రచురించిన పరిశోధనలో 73 జంటలను పరిశీలించారు. 4 ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు వారి ప్రవర్తనను అధ్యయనం చేశారు. గొడవలను పరిష్కరించుకునే విధానం, భావోద్వేగ స్పందనల ఆధారంగా ఐదు గ్రూపులుగా విభజించారు. వాలిడేటర్స్, వోలటైల్స్, అవాయిడర్స్, హోస్టైల్ కపుల్స్, హోస్టైల్ డిటాచ్డ్ కపుల్స్‌గా గుర్తించారు.

Also Read: పిల్లలతో కోపంగా మాట్లాడి మళ్లీ వారి మనసు గెలవాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఇది తప్పనిసరిగా పాటించాలి

ఈ గ్రూపుల మధ్య విడాకుల గురించి ఆలోచించడం, వాస్తవంగా విడాకులు తీసుకోవడం వంటి అంశాల్లో తేడాలు కనిపించాయి. మొదటి మూడు గ్రూపులు స్థిరమైన బంధాలుగా, మిగిలిన రెండు గ్రూపులు అస్థిరమైన బంధాలుగా గుర్తించారు. భాగస్వామి బాధలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఉండటం సమస్యలను మరింత పెంచుతాయి. వారి మాటలను వినడం, బాధకు కారణం అడగడం, భావాలను గౌరవించడం మంచి మార్పు తీసుకురావచ్చు.

Also Read: రోజూ మీ భార్యతో ఫ్లర్టింగ్ చేస్తున్నారా? దాంపత్య జీవితంలో జరిగేది ఇదే..

చిన్న మార్పులతో వైవాహిక బంధాన్ని బలపరచుకోండి

భార్యాభర్తలు ప్రతీ విషయంలో ఒకే అభిప్రాయంతో ఉండాల్సిన అవసరం లేదు. కానీ, ఒకరి భావాలను మరొకరు గౌరవించాలి. సహనం, పరస్పర అవగాహన, గౌరవంతో కూడిన సంభాషణ దాంపత్య జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా భాగస్వామి మాట్లాడాలనుకున్నప్పుడు శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం.

Related News

పాకెట్ మనీ అస్సలు ఖర్చు పెట్టరు.. ఈ తేదీల్లో జన్మించిన పిల్లలు పుట్టకతోనే ‘ఫైనాన్షియల్ జీనియస్’sr

మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్

చలికాలంలో జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? ఉదయాన్నే టీ తాగే ముందు ఈ స్పైసీ డ్రింక్ తాగండి చాలు

భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ఏఐ.. విడాకుల వరకు వెళ్లిన గొడవ

నెయ్యి లేకుండా మైసూర్ పాక్! ఇంట్లోనే స్వీట్ షాప్ టేస్ట్‌

లెమన్ ఫిష్ రెసిపీ..తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి!

బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ రావాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

Big Stories

Advertisement
×