BigTV English

Water Heater : హీటర్‌తో నీటిని వేడి చేస్తున్నారా..! ఈ జాగ్రత్తలు మీకోసమే..

Water Heater : హీటర్‌తో నీటిని వేడి చేస్తున్నారా..! ఈ జాగ్రత్తలు మీకోసమే..

Water Heater : వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు వేడి నీటిని ఉపయోగించేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇలా వేడి నీటిని ఇష్టపడే వారు ఎక్కువగా స్నానం చేసేందుకు, తాగేందుకు నీటిని వాడుతారు. నీటిని వేడి చేసేందుకు పూర్వం కట్టెల పొయ్యిలు వాడే వారు. ఈ కాలంలో గ్యాస్ పొయ్యిపై, అలానే హీటర్ ద్వారా నీటిని వేడి చేస్తున్నారు. అయితే హీటర్‌ని ఉపయోగించి నీటిని వేడి చేసేప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.


వాటర్ హీట్ చేసేందుకు మరి మీరు కూడా హీటర్ వాడుతున్నారా?.. అయితే పాటించాల్సిన విషయాలపై ఓ లుక్కేద్దామా..!

డిసెంబర్ నెల ప్రారంభం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలికాలం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. దీంతో స్నానం చేసేందుకు వేడి నీళ్లను ఉపయోగిస్తున్నారు. వేడి నీళ్లు లేకుండా స్నానం చేయాలంటే చలితో వణికే పరిస్థితి ఏర్పడింది.


అయితే వేడి నీటి కోసం గ్యాస్ స్టవ్, గీజర్, వాటర్ హీటర్లను వాడుతున్నారు. చాలా మంది వాటర్‌ను హీట్ చేసేందుకు హీటరే మేలని దాన్నే ఉపయోగిస్తున్నారు. హీటర్‌ను వాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా హీటర్‌ను స్నానపు గదిలో ఉంచకూడదు. ఎందుకంటే హీటర్లు అటోమెటిక్‌గా స్వీచ్చాఫ్ అవ్వవు. మాన్యువల్‌గా పనిచేస్తాయి. హీటర్‌లో నీటిని వేడి చేసేప్పుడు రాడ్ పూర్తిగా మునిగిన తరువాతే స్విచ్ ఆన్ చేయాలి. నీరు వేడెక్కుతందో లేదో చూసేప్పుడు స్విచ్ ఆఫ్ చేసి హీటర్ బయటకు తీయాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో విద్యుత్తు షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

హీటర్‌తో నీటిని వేడి చేసేప్పుడు మెటల్ బకెట్ అసలు ఉపయోగించొద్దు. హీటర్ కూడా మెటల్‌తో తయారు చేస్తారు కాబట్టి, అందులో విద్యుత్ సరఫరా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ బకెట్ వినియోగించినా వేడిని గమనిస్తూ ఉండాలి. వేడి అధికమైతే బకెట్ కాలిపోతుంది. భద్రతలో రాజీ పడకుండా నాణ్యమైన హీటర్‌లనే వాడాలి. హీటర్ వాడే వారు కచ్చితంగా వీటిని గుర్తుంచుకోవాలి.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×