BigTV English

Prabhaharan : పైలెట్ వద్దు.. టీ, కాఫీ డెలివరీయే ముద్దు!

Prabhaharan : పైలెట్ వద్దు.. టీ, కాఫీ డెలివరీయే ముద్దు!

Prabhaharan : మధురైలో ఓ నగల తయారీ కుటుంబంలో పుట్టిన ప్రభాహరన్‌.. పైలెట్ కావాలనుకున్నాడు. ‘సరే నీ ఇష్టం. కానీ.. ఓ ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చి.. మన నగల వ్యాపారం చూసుకోవాలి’ అన్నారు తల్లిదండ్రులు. సరేనంటూ మనోడు.. అమెరికా వెళ్లి, మూడేళ్లలో పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేసి, ట్రైనీ పైలెట్‌గా పనిచేశాడు. ఇండియాలోనూ లైసెన్స్ తీసుకున్నాక.. పలు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ నుంచి పైలెట్ ఉద్యోగాలొచ్చాయి.


టీ టైంలో ఓ రోజు తమ జ్యువెలరీ షాప్‌కి వెళ్లాడు. అక్కడికి వచ్చే కస్టమర్ల కోసం.. తండ్రి కాఫీలు, టీలు తెప్పించటం, పనివాళ్లు బయటి హోటళ్లలో తెచ్చే సరికి అవి చల్లారిపోవటంతో.. కస్టమర్లు కొద్దిగా రుచి చూసి పక్కన పెట్టేయటాన్ని గమనించాడు. దేశంలో రోజుకు ఇలా ఎన్ని వేల కప్పుల టీ, కాఫీ వేస్ట్ అవుతుందో లెక్కేసి.. షాపులకు, మాల్స్‌కు వచ్చే కస్టమర్ల కోసం నాణ్యమైన, వేడి వేడి టీ, కాఫీలు అందించే బిజినెస్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

2020లో ‘కప్‌టైమ్‌’ పేరుతో స్టార్టప్‌ ప్రారంభించి, మసాలా టీ, ఫిల్టర్‌ కాఫీల తయారీకి ముడిసరుకు నేరుగా రైతుల నుంచే కొని, పేద, మధ్యతరగతి యువతకు పార్ట్‌టైమ్ డెలివరీ బాయ్‌ జాబ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. టెక్నాలజీ సాయంతో టీ, కాఫీ తయారీ మాస్టర్లు మారినా రుచి, నాణ్యత మారకుండా ప్రత్యేక మెథడాలజీ తీసుకొచ్చాడు. మొదట్లో రోజుకి 10 కప్పులతో మొదలైన వ్యాపారం ఇప్పుడు 10 వేల కప్పులకు చేరింది.


Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×