Chanakya Niti: సంతోషకరమైన దాంపత్యానికి భార్యాభర్తలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా..? భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన సూత్రాలేంటో తెలుసా..? అసలు చాణక్యనీతిలో ఏముందో తెలుసా..?
చాణక్యనీతి ప్రకారం భార్యాభర్తలు సంతోషకరమైన మరియు దీర్ఘకాలిక దాంపత్యానికి పునాది పరస్పర గౌరవం, నమ్మకం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమట. చాణక్య నీతి మాత్రమే కాకుండా గరుడ పురాణం వంటి గ్రంథాల్లోనూ మన పెద్దలు చెప్పిన మాటల్లోనూ దాంపత్యం గురించి కొన్ని చక్కని సూత్రాలు ఉన్నాయి అంటున్నారు పండితులు.
పరస్పర గౌరవం (Mutual Respect): భార్యాభర్తలు ఎప్పడూ కూడా ఒకిరినొకరు తక్కువ అంచనా వేసుకోకూడదట. ఇద్దరూ సమానమని గుర్తించుకోవాలట. ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించడం అలవర్చుకోవాలట. కోపంలో ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు కించపరుచుకోకుండా పరస్పరం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలట. మీరు వాడే భాష మీ మధ్య ఉన్న బంధాన్ని నిర్ణయిస్తుందట.
స్పష్టమైన కమ్యూనికేషన్ (Open Communication): మనసులో ఏదైనా బాధగా ఉంటే మౌనంగా ఉండటం కంటే ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం ఉత్తమమని చాణక్యనీతిలో ఉందట. అలాగే ఎదుటి వారి మాటలను కూడా ఓపికగా వినాలట. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిస్థాయిలో విన్నాకే మీ అభిప్రాయాన్ని వాళ్లకు చెప్పాలట.
నమ్మకం – పారదర్శకత (Trust & Transparency): అనుమానం దాంపత్యానికి అతిపెద్ద శత్రువట. ఒకరి మీద ఒకరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుమానం రాకూడదట. ఏ చిన్న సందేహం ఉన్నా ఒకరిని ఒకరు అడిగి తెలుసుకోవాలట అంతేకానీ కోపతాపాలకు పోయి పెద్దది చేసుకోకూడదట. అనుమానం పెనుభూతం లాంటిది అని మన పెద్దలు ఎప్పుడో చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోవాలి. అలాగే అబద్ధాలు చెప్పడం వల్ల తాత్కాలికంగా సమస్యలు తీరవచ్చు.. కానీ దీర్ఘకాలంలో నమ్మకాన్ని దెబ్బతీస్తాయట.
బాధ్యతల పంపకం (Sharing Responsibilities): భార్యాభర్తలు ఇద్దరు ఇంటి పనులు, ఆర్థిక విషయాలు, పిల్లల పెంపకం… ఇలా అన్నింటిలో ఇద్దరూ భాగస్వాములుగా ఉండాలి. ఏ ఒక్కరి మీదో భారం పడకుండా చూసుకోవాలట. ఇంటి ఆదాయం, ఖర్చుల విషయంలో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆర్థిక గొడవలు తగ్గుతాయట.
కష్టసుఖాల్లో తోడుండటం (Support in Ups & Downs): జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఒకరికొకరు ధైర్యంగా నిలబడాలట. మీరు విమర్శించే వ్యక్తి కంటే, భరోసా ఇచ్చే వ్యక్తిగా ఉండటం వల్ల మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందట. ఎదుటివారు చేసిన మంచిని చిన్నదైనా సరే గుర్తించి ప్రశంసించడం నేర్చుకోవాలట. దీని వల్ల మీ మధ్య బంధం మరింత దృఢవుతుందట.
క్షమించే గుణం (Forgiveness): మనుషులన్నాక చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేయడం సహజం. కానీ పదే పదే పాత విషయాలను గుర్తు చేస్తూ నిందించడం వల్ల బంధం బలహీనపడుతుందట. క్షమించి ముందుకు సాగడం నేర్చుకుంటే జీవితంలో హ్యాపీగా ఉండవచ్చట.
సమయం కేటాయించడం (Quality Time): మీరు ఎంత బిజీ గా ఉన్నా కూడా ఒకరి కోసం ఒకరు వ్యక్తిగత సమయం కేటాయించుకోవాలి. కనీసం రోజుకు కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోండి. కనీసం భోజనం చేసేటప్పుడు ఫోన్లు పక్కన పెట్టి మాట్లాడుకోండి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.