Mystery virus: ముందు కరోనా, తర్వాత HMPV ఇప్పుడు అదే తరహాలో మరో కొత్త రకం వైరస్ తయారైందని వార్తలు వస్తున్నాయి. రష్యాలో ఓ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ‘మిస్టరీ వైరస్’ వల్లనే దగ్గినప్పుడు నోట్లో నుంచి రక్తం పడుతోందని మెడికల్ రిపోర్ట్‌లు రావడంతో ఆందోళన చెందాల్సి వస్తోంది.
రష్యాలో ఉండే అలెగ్జాండ్రా అనే మహిళ కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతోందట. మరికొన్ని నగరాల్లో చాలా మంది తమకు ఇటువంటి సమస్య వచ్చినట్టుగా తెలిపారు. దీని వల్ల తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు, దగ్గు వస్తోందని వెల్లడించారు.
ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా లాభం లేకపోయిందని తెలిపారు. దీంతో చాలా సార్లు కరోనా టెస్ట్‌లు చేయించుకున్నా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. దీంతో ఏదో కొత్త రకం వైరస్ కారణంగానే ఇలా జరిగి ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కరోనా లాగానే ఇది కూడా ప్రాణాంతకం కావొచ్చని భావిస్తున్నారు.
ALSO READ: ఇంటిపై కూలిన విమానం
అయితే రష్యా అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. అటువంటి ప్రాణాంతకమైన వైరస్ తమ దేశంలో లేదని చెబుతున్నారు. అలెగ్జాండ్రాకు మెడికల్ టెస్ట్‌లు చేయించినా ఎలాంటి వైరస్ అనవాళ్లు కనిపించలేదని అక్కడి వైద్య నిపుణులు తెలిపారు. తమ దేశంలో ప్రాణాంతకమైన వైరస్ ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. మైకోప్లాస్మా న్యుమోనియా కారణంగానే ఆ మహిళకు దగ్గినప్పుడు నోట్లో నుంచి రక్తం వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు.