Jack Movie:బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, యూట్యూబర్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్గా ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం జాక్ (Jack). భారీ అంజనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఈరోజు ఉదయం ట్రైలర్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇదొక యాక్షన్, డ్రగ్స్ నేపథ్యంలో రాబోతున్న సినిమా కావడమే కాకుండా ఇందులో హీరో, హీరోయిన్ మధ్య ఉండే రొమాన్స్ కూడా యువతను బాగా ఆకట్టుకోబోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన పాపం సిద్దుని చుట్టుకుందని, ఈ గొడవ కాస్త ఫిలిం ఛాంబర్ కు ఎక్కిందని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Shobhita dhulipala:నాకు ఆ 3 రోజూ కావాల్సిందే… అసలు విషయం బయట పెట్టిన అక్కినేని కొత్త కోడలు
డైరెక్టర్ ను నమ్మి, దారుణంగా మోసపోయిన నిర్మాత బాపినీడు..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నిర్మాత బాపినీడు నిర్మాణంలో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ నిర్మించిన చిత్రం గాండీవధారి అర్జున.. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ ను మూటగట్టుకుంది. పైగా తాను బడ్జెట్ లిమిట్ లో సినిమాలు తీస్తా.. నిర్మాతకు లాభమే తప్పా నష్టం రాదు అని గొప్పగా కబుర్లు చెప్పిన ప్రవీణ్ సత్తార్.. తీసిన ఈ సినిమా వల్ల నిర్మాత బాపినీడు చాలా దారుణంగా నష్టపోయారు. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తార్ కు మెయిన్ స్ట్రీమ్ సినిమా ఇచ్చే సాహసం ఇంకో నిర్మాత చేయలేదు. అయితే ఇప్పుడు ఆ పాపం మళ్లీ వెంటాడుతోంది. నిర్మాత బాపినీడు గాండీవ దారి అర్జున సినిమా షాక్ నుండి తేరుకొని.. తాజాగా సిద్దు జొన్నలగడ్డతో జాక్ అనే సినిమా చేస్తున్నారు.
జాక్ విడుదల ఆపివేయాలని ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్..
ప్రస్తుతం ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. హీరో సిద్దు మధ్య అంతగా పొసగకపోయినా ఎలాగో నెట్టుకొస్తూ ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గాండీవధారి సినిమా ఈస్ట్ థియేటర్ హక్కులను కొనుగోలు చేసిన అనూ శ్రీ సత్యనారాయణ, వెస్ట్ హక్కులను కొనుగోలు చేసిన ప్రవీణ్ లోకల్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. తమకు గాండీవ దారి సినిమా రికవరబుల్ షరతుల మీద హక్కులు ఇచ్చారని, ఆ సినిమా అసలు కలెక్షన్స్ వసూలు చేయలేదని, తమ డబ్బులు తమకు వెనక్కి ఇవ్వలేదని, ఆ డబ్బులు వ్యవహారం సెటిల్ అయ్యే వరకు నిర్మాత బాపినీడు నిర్మించిన జాక్ సినిమా విడుదల ఆపాలని, వారు లోకల్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు.
అతడు చేసిన పాపం.. జాక్ మూవీకి చుట్టుకుందా..
అయితే ఫిర్యాదు చేసినంత మాత్రాన సినిమా ఆగిపోదు కానీ ఇప్పుడు ఆ పాత బాకీలు అన్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత నిర్మాత బాపినీడు మీదే పడింది. ఎంతో కొంత వాళ్లకు చెల్లించి, ప్రవీణ్ సత్తార్ చేసిన పాపాన్ని కడిగేసుకోవాలని, అటు బాపినీడు కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఆ సినిమా పాపం సిద్దు సినిమాకి చుట్టుకోవడం నిజంగా బాధాకరమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.