BigTV English

Anemia: ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఫుడ్స్‌ని డైట్‌లో యాడ్ చేసి చూడండి..

Anemia: ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఫుడ్స్‌ని డైట్‌లో యాడ్ చేసి చూడండి..

Anemia: ఎనీమియా అనేది శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్య. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎనీమియా సాధారణంగా ఐరన్, విటమిన్-B12, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఎనీమియాను నియంత్రించవచ్చని అంటున్నారు. ఎనీమియాను తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆకు కూరలు
పాలకూర, మెంతి కూర, బచ్చలి వంటి ఆకు కూరలలో ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు అధికంగా ఉంటాయట. ఈ కూరగాయలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఒక కప్పు ఆకు కూరలను కూరల్లో లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటిని నిమ్మరసంతో కలిపి తింటే ఐరన్ లెవెల్ మెరుగవుతుందట.

బీట్‌రూట్
బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్లడ్‌లోని హిమోగ్లోబిన్ లెవెల్స్‌ను పెంచడంలో ఇవి సహాయపడతాయట. బీట్‌రూట్‌ను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం ఎనీమియా లక్షణాలు తగ్గిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.


డ్రై ఫ్రూట్స్
బాదం, జీడిపప్పు, ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుందట. ఖర్జూరంలో విటమిన్-సి కూడా ఉంటుంది. ఇది ఐరన్ పెంచేందుకు సహకరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం రెండు ఖర్జూరాలు, కొన్ని బాదంలను తీసుకోవడం శరీరానికి శక్తి కూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

చిక్కుడు కాయలు
చిక్కుడు, బీన్స్, సోయాబీన్ వంటి కాయధాన్యాల్లో ఐరన్, ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయట. వారానికి 2-3 సార్లు చిక్కుడు కాయలను కూరలో లేదా సూప్‌లో చేర్చుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: ఊడిన జుట్టు ఒత్తుగా పెరగాలంటే?

పండ్లు
దానిమ్మ, ఆపిల్, అరటి వంటి పండ్లు ఎనీమియాను తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో ఐరన్, విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఐరన్ పెంచేందుకు ఇవి సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే రోజూ ఒక దానిమ్మ లేదా ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం ఉత్తమం.

గుడ్డు, మాంసం
మాంసాహారులకు గుడ్డు, చికెన్, చేపలు, కాలేయం వంటివి ఐరన్, విటమిన్-B12లకు మంచి మూలం. ఈ ఆహారాలు శరీరంలో ఐరన్ లోపాన్ని త్వరగా తొలగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి 2-3 సార్లు గుడ్డు లేదా చేపలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు,

ధాన్యాలు
ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణ ధాన్యాలలో ఐరన్, ఫోలిక్ యాసిడ్‌ ఎక్కువగా ఉంటుందట. ఉదయం పండ్లతో కలిపి ఓట్స్‌ను తీసుకోవడం ఎనీమియా సమస్య నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ఐరన్ లెవెల్స్ పెరగాలంటే విటమిన్-సి ఉండే నిమ్మ, టమాటో వంటి ఆహారాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లంచ్ టైంలో టీ, కాఫీని తీసుకోవద్దట, ఇవి ఐరన్ లెవెల్స్‌ని తగ్గించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎనీమియా తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×