E-Paper
Advertisement

Banana: రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల ఏం జరుగుతుంది?

Banana: రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల ఏం జరుగుతుంది?
Advertisement

రోజుకో అరటి పండు తింటే మంచిదని కొంతమంది చెబుతారు. మరికొందరు తినకూడదు అంటారు. మరి ఈ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారు? రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అరటిపండు మనకు సులభంగా దొరికే పండు మాత్రమే కాదు, తక్కువ రేటులో కూడా దొరుకుతాయి. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంగా కూడా చెప్పుకుంటారు. ఈ పండులో పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఉదయం అల్పాహారంతో పాటు ఒక అరటిపండు తింటే రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. క్రీడాకారులు, ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు అరటిపండును ఎక్కువగా తీసుకోవడానికి ఇదే కారణం.

అరటిపండు తినడం వల్ల లాభాలు
రోజుకు ఒక అరటిపండు తినడం గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు సరిగా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కొంతవరకు తగ్గుతుంది. అలాగే అరటిపండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభం చేస్తుంది. కడుపు బద్ధకం సమస్య ఉన్నవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రోజూ ఒక అరటిపండు తినే అలవాటు పెడితే కడుపు సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

Also read: Akkineni Hero: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్ తోనే ప్రేమలో పడిన అక్కినేని హీరో.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!

మానసిక ఆరోగ్యానికి
అరటిపండు మన మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే కొన్ని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే అలసట, బలహీనతగా అనిపించినప్పుడు అరటిపండు తింటే త్వరగా శక్తి వస్తుంది. అందుకే చాలా మంది మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నాక్‌గా అరటిపండు తింటారు. పిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినగలిగే పండు కావడం మరో ప్రత్యేకత.

Advertisement

Also read: Infinix Note 60 Pro: ఐఫోన్ లుక్.. నథింగ్ ఫీచర్లు.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

అయితే రోజుకు ఒక అరటిపండు తినడం మంచిదే కానీ, అధికంగా తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. అలాగే పూర్తిగా పండిన అరటిపండును మాత్రమే తినడం మంచిది. సమతుల్య ఆహారంతో పాటు అరటిపండును తీసుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రయోజనం ఉంటుంది. మొత్తానికి రోజుకు ఒక అరటిపండు తినడం శరీరానికి శక్తి, జీర్ణక్రియకు మేలు, గుండె ఆరోగ్యానికి సహాయం వంటి అనేక ప్రయోజనాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×