BigTV English

Younger One In house : మీ ఇంట్లో అమ్మా, నాన్నకి ఎవరంటే ఎక్కువ ఇష్టం..

Younger One In house : మీ ఇంట్లో అమ్మా, నాన్నకి ఎవరంటే ఎక్కువ ఇష్టం..

Younger One In house :  ఇంట్లో పెద్ద పిల్లాడు కాఫీ ఒలికిస్తేనే చటుక్కున కోపడే అమ్మ, చిన్నోడు కప్పు పగులగొట్టినా తెలియక చేశాడులే అంటూ సర్దుకుపోతుంది. పెద్ద కూతురు అనుకున్న మార్కులు సాధించలేకపోతే కూర్చోబెట్టి క్లాస్ పీకే నాన్న.. చిన్న కూతురు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా మందలించడు. మా అమ్మకు చిన్నోడు అంటేనే ఇష్టం, మా నాన్నకు తన చిన్నకూతురు అంటేనే ప్రేమ… ఇలాంటి మాటలు దాదాపు అన్ని కుటుంబాల్లో వింటూ ఉంటాం. ఇది నిజమేనా అని ఎవరినైనా అడిగి చూడండి.. అబ్బే పిల్లలు అలా అనుకుంటారు కానీ.. అలాంటిదేమీ లేదండి. చిన్నతనం తెలియక అలా అనుకుంటున్నారు.. అంటూ తల్లిదండ్రులు తప్పించుకుంటారు. కానీ.. ఇదే విషయంపై పరిశోధన చేసిన పరిశోధకులు.. ఇంట్లో చివరి సంతానంపే గారాబం, ప్రేమ ఎక్కువే అని తేల్చేశారు. అంతే కాదు.. చాలా విషయాల్లో వారి వైపు తల్లిదండ్రులు నిలబడతారంట కూడా.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.. ఓ పరిశోధన. అందులో ఏముందంటే..


ఇంట్లో చివర సంతానానికి కాస్త తెలివి ఎక్కువ, వాళ్లు ఎక్కడికి వెళ్లినా అనుకున్నది సాధించుకు వస్తారు అని తల్లిదండ్రలకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది అంటా.. అందుకే పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలకే ఎక్కువ స్వేచ్ఛనిస్తారంట. వాళ్లు ఎదిగే క్రమంలో చిన్నపిల్లలు తీసుకునే నిర్ణయాలకు మంచి మద్ధతు కూడా ఇస్తారంటున్నారు.. పరిశోధకులు. తాజాగా.. ఓ సైకలాజికల్ బులెటెన్ లో ప్రచురితమైన ఈ పరిశోధనలో.. ఏకంగా 20 వేల మంది తల్లిదండ్రులపై సర్వే నిర్వహించారు. గతంలో కుటుంబాల్లోని వ్యక్తుల అనుబంధాలు, వారి మధ్య సంబంధాలపై చేసిన 30కి పైగా నివేదికల, 14 డేటాబేస్ లలోని సమాచారాన్ని క్రోడీకరించి.. ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో.. సంతానంలో లింగ భేదాలు, పెద్ద, చిన్న పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు వ్యవహరించే విధానాన్ని పరిశీలించేందుకు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో.. తల్లిదండ్రులు ఎక్కువ గారాబం చేయడంలో తమ చివరి సంతానం వైపే కాస్త మొగ్గు చూపుతారని తేల్చారు.

తల్లిదండ్రులు ఎంత లేదన్నా, కాదన్నా.. ఒక సంతానం కంటే మరొకరిపై కచ్చితంగా వివక్షతో కూడిన ప్రేమ, అభిమానం చూపుతారంటున్నారు పరిశోధకులు. ఒకరిపై కంటే మరొకరిపై ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టడం, పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వారు కోరుకున్నవి అందించడం సహా.. అనేక అంశాల్లో ఎవరో ఒకరి వైపే మొగ్గుతారని తేలింది. ఇందులోనూ.. చిన్నారులంటేనే అభిమానం చూపే తల్లిదండ్రులే ఎక్కువ అని అంటున్నారు.


ఆడపిల్లపైనే అంతులేని ప్రేమ.. 

కొడుకు, కూతురు ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటుంది అని పరిశోధకులకు ఆలోచన వచ్చినప్పుడు.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రులకే కాదు, తల్లులకు కూడా ఆడపిల్ల వైపే ఎక్కువగా మమకారం చూపుతారని తేలింది. మగ పిల్లల కంటే ఆడపిల్లల్ని ప్రేమగా, జాగ్రత్తాగ చూసుకుంటామని మెజార్టీ తల్లిదండ్రులు చెప్పారంట. అయితే.. కుటుంబం అంటే కాస్త బాధ్యత, మిగతా కుటుంబ సభ్యులను ఓ కంట కనిపెడుతూ.. కుటుంబానికి అండగా నిలిచే సంతానంపై చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రత్యేకమైన ప్రేమ పొందుతారని వెల్లడైంది.

Also Read : కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి.. ఇలా చేయండి

కుటుంబ బంధాలు, సంబంధాలపై మరింత లోతైన అవగాహన కోసం ఇలాంటి అధ్యయనాలు చాలా అవసరం అంటున్నారు పరిశోధకులు. లింగ భేదం, వయసు, బిహేవియర్ తో సంబంధం లేకుండా.. ఇంట్లోని అందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఒకే రకమైన ప్రేమను పొందడం చాలా ముఖ్యమంటున్నారు. తల్లిదండ్రులు తెలియక కూడా ఒకరిపై ఎక్కువ, మరొకరపై తక్కువ ప్రేమ చూపెట్టవద్దని సూచిస్తున్నారు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×