E-Paper
Advertisement

ప్రేమ పేరుతో ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే ఏం చేయాలి? ఈ జాగ్రత్తలు పాటించండి

ప్రేమ పేరుతో ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే ఏం చేయాలి? ఈ జాగ్రత్తలు పాటించండి
Advertisement

Signs Of stalker| యుక్త వయసులో ఒక వ్యక్తి పట్ల మొదట్లో ఆకర్షణ పెరగవచ్చు. అతడు అందరిలో ప్రత్యేకంగా అనిపించవచ్చు. వారితో ప్రారంభంలో స్నేహం బాగుంటుంది. అతను మీ సోషల్ మీడియాలో చేసే పోస్టులను లైక్ చేస్తాడు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసేందుకు ఆసక్తికర మెసేజ్‌లు కూడా చేస్తాడు. మీ గురించి చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుని మాట్లాడవచ్చు. ఇలాంటి స్పెషల్ కేర్ చూసి మీరు మొదట అది ప్రేమ అని భావించే అవకాశం ఉంది.

అయితే, చాలాసార్లు ఆ వ్యక్తి చూపించే శ్రద్ధ మీకు ఇబ్బందిగా అనిపించడం మొదలైతే పరిస్థితిని గమనించాలి. అతని ప్రవర్తన క్రమంగా భయం, ఒత్తిడి లేదా అసౌకర్యానికి కారణం కావచ్చు. అతను ఒక సైకో లాగా ప్రవర్తించే అవకాశం ఉంది.

హద్దులు దాటినప్పుడు ఆ ప్రవర్తన స్టాకింగ్‌ అని గుర్తించాలి

Advertisement

స్టాకింగ్ అంటే కేవలం ఒక వ్యక్తిపై ఎక్కువగా ఇష్టం చూపించడం కాదు. పదేపదే అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా సంప్రదించడం లేదా వెంబడించడం కూడా ఇందులోకి వస్తుంది. ఇలాంటి ప్రవర్తన మీ భద్రతపై భయం లేదా ఆందోళన కలిగించవచ్చు.

సంబంధం ముగిసిన తర్వాత కూడా స్టాకింగ్ ప్రారంభమవుతుంది

కొన్నిసార్లు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కూడా ఇలా ప్రవర్తించవచ్చు. అందుకే స్టాకింగ్‌కు సంబంధించిన కొన్ని హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవాలి

Advertisement

మీరు వద్దని చెప్పిన తర్వాత కూడా వ్యక్తి కాల్స్ లేదా మెసేజ్‌లు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్ చేసిన తర్వాత కొత్త సోషల్ మీడియా అకౌంట్‌తో మళ్లీ సంప్రదించడం కూడా హెచ్చరిక సంకేతమే.
మీ ఇంటి దగ్గర లేదా పనిచేసే చోట అకస్మాత్తుగా ఆ వ్యక్తి కనిపించడం కూడా ఆందోళన కలిగించే విషయం. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి స్నేహితులను ప్రశ్నించడం కూడా ఒక ప్రమాదకర సంకేతం.

మీ ఆన్‌లైన్ యాక్టివిటీస్ నిరంతరం గమనించడం

మీరు వద్దని తిరస్కరించినా మీ వెంటపడి తనతో సమయం గడపాలని, మీ ప్రేమ తనకు కావాలని కోరుకోవడం కూడా సమస్యే.

ఏదైనా తప్పుగా అనిపిస్తే మీ గట్ ఫీలింగ్ నమ్మాలి

చాలామంది ఇతరులు ఏమనుకుంటారోనని తమ అసౌకర్యాన్ని బయటికి చెప్పరు. అలా చేయడం వల్ల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఆలస్యం కావచ్చు. ఎవరైనా ప్రవర్తన మీకు అసురక్షితంగా అనిపిస్తే దూరంగా ఉండే హక్కు మీకు ఉంది. మీరు ఎవరికీ ఎక్కువ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.

స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేయాలి

మీకు ఆ వ్యక్తితో ప్రమాదం లేదని అనిపిస్తే, ఇకపై సంప్రదించవద్దని స్పష్టంగా చెప్పండి. తర్వాత పదేపదే చర్చలు లేదా వాదనలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఆ వ్యక్తిని మార్చేందుకు ఎక్కువగా ప్రయత్నించడం వల్ల సమస్యలు వస్తాయి. అతని వల్ల ప్రమాదం అనిపిస్తే మాత్రం ఆ వ్యక్తిని ఎదుర్కొనే ప్రయత్నం చేయకండి.

జరిగిన ప్రతి ఘటనకు ఆధారాలను భద్రపరచాలి

మెసేజ్‌లు, ఈమెయిల్స్, కాల్స్, ఫేక్ అకౌంట్లు, బెదిరింపుల స్క్రీన్‌షాట్‌లను సేవ్ చేసి పెట్టండి. ఏదైనా ఘటన జరిగిన తేదీ, సమయం, ప్రదేశాన్ని కూడా నమోదు చేసుకోండి. ఇలాంటి ఆధారాలు అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా అధికారులు సహాయం చేయడానికి ఉపయోగపడతాయి.

నమ్మకమైన వ్యక్తులతో మీ సమస్య గురించి చెప్పాలి

స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన సహోద్యోగులకు విషయం చెప్పండి. అవసరమైతే కార్యాలయ భద్రతా సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వండి.

సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగులను పరిశీలించండి

మీ లైవ్ లొకేషన్ లేదా రోజువారీ రొటీన్‌ గురించి సోషల్ మీడియాలో బహిరంగంగా షేర్ చేయడం ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో మంచిది కాదు.

Also Read: వీరి ప్రేమకు హద్దులు ఉండవు.. ఈ పేరు గలవారు ప్రేమలో ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తారు

ప్రమాదం పెరిగితే వెంటనే సహాయం తీసుకోవాలి

బెదిరింపులు లేదా వేధింపులు పెరిగితే సంబంధిత అధికారులను సంప్రదించండి. ప్రమాదం ఉంటే తక్షణమే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడం ముఖ్యం.

Also Read: పిల్లలు మీతో ఏదీ దాచుకోకుండా చెప్పాలంటే ముందుగా ఈ 5 అలవాట్లు మార్చుకోండి

అతను చేసే స్టాకింగ్‌కు మీరు బాధితులు కారణం కాదు

ఎవరైనా స్టాకింగ్ చేయడానికి వారి స్వంత చర్యలు, నిర్ణయాలే కారణం. మీ దుస్తులు, స్నేహపూర్వక ప్రవర్తన లేదా తిరస్కరణ దీనికి కారణం కాదు.

ప్రేమ పేరుతో భయం లేదా ఇబ్బందికరంగా వెంటపడేవారిని భరించాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీ భద్రతకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.

Tags

Related News

వెజిటేరియన్ కబాబ్స్.. పండుగవేళ శాఖాహారులకు టేస్టీ రెసిపీ.. ఇంట్లోనే ఇలా చేయండి

నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా చికెన్ మలయ్ కబాబ్ రెసిపీ.. పెనంపైనే సింపుల్‌గా!

ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు.. ఎన్ని రోటీలైనా క్షణాల్లో ఖాళీ అయిపోవాల్సిందే!

నోరూరించే పంజాబీ భేండీ మసాలా..రోటీ,చపాతీకి ఫర్పెక్ట్ కాంబినేషన్

చేపలు లేవు.. అయినా ఈ రెసిపీ పేరు బొమ్మిడాల చారు.. రాయలసీమ సీక్రెట్ రెసిపీ ఇదే!

పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్..ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అద్భుతమైన రుచి

రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ.. గోదావరి రుచి ఇంట్లోనే!

ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

Big Stories

Advertisement
×