E-Paper
Advertisement

Kissik talks:అనుష్కతో పోలికా.. కామాక్షి క్రేజ్ మామూలుగా లేదుగా!

Kissik talks:అనుష్కతో పోలికా.. కామాక్షి క్రేజ్ మామూలుగా లేదుగా!
Advertisement

Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెలెబ్రిటీ టాక్ షో కిసిక్ టాక్స్ . ఎన్నో సెలెబ్రిటీల టాక్ షోలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకువస్తున్నా, కిసిక్ టాక్స్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం. ఇక ఇప్పటి వరకు 70 ఎపిసోడ్స్‌ని సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని, ఇప్పుడు 71వ ఎపిసోడ్‌తో మనముందుకు వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్‌కి ఇటీవల ‘అగధ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కామాక్షి భాస్కర్ల ముఖ్య అతిథిగా రావడం విశేషం. మరి కామాక్షి, యాంకర్ వర్షతో పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలేంటో చూసేద్దాం.

సక్సెస్ అయినందుకు చాలా సంతోషం

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ… అగధ సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని, సినిమా ప్రమోషన్స్ సమయంలో చాలా కష్టపడ్డామని, ప్రతి చోట సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు టీమ్ మొత్తం ఎంతో ఎఫర్ట్ పెట్టిందని తెలిపారు. ఆ కష్టానికి ఇప్పుడు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Advertisement

సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా తన పాత్ర గురించి, తన నటన గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తనకు తెలిసిన పరిధిలో మంచి స్థాయిలో పాత్రను చేయగలిగాననే సంతృప్తి ఉందన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు తన పాత్రను ఇష్టపడటం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

అనుష్కని చూసినట్టు ఉంది

ఇక సినిమాలో తన పాత్రకు వస్తున్న స్పందనను చూసి కొందరు తనను అనుష్కతో పోలుస్తుండటంపై కూడా స్పందించారు. అనుష్క లాంటి స్టార్‌తో తనను పోల్చడం చాలా పెద్ద విషయమని, అలాంటి పోలిక తనపై మరింత బాధ్యత పెంచుతుందని చెప్పారు. తన పాత్రకు ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని తాను అసలు ఊహించలేదని తెలిపారు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారే స్వయంగా “అనుష్కని చూసినట్టు ఉంది” అని చెప్పడం అసలు మర్చిపోలేనని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ట్రోల్ చేసినా  స్పోర్టివ్‌గా తీసుకుంటా

Advertisement

అయితే ప్రేక్షకులు తనను ట్రోల్ చేసినా, ప్రశంసించినా వాటిని స్పోర్టివ్‌గా తీసుకుంటానని ఆమె అన్నారు. ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ తనను చాలా హ్యాపీగా ఉంచుతోందని, ఇలాంటి ఆదరణ దక్కడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. సినిమా సక్సెస్ తర్వాత తనపై అంచనాలు కూడా పెరిగాయని భావిస్తున్నానని తెలిపారు.

ఇక సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి కష్టమే ఈ విజయానికి కారణమని ఆమె చెప్పారు. తాను మాత్రమే కాకుండా టీమ్ మొత్తం ఎంతో హార్డ్ వర్క్ చేసిందని తెలిపారు. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, ఇక ముందు కూడా మంచి పాత్రలు చేయాలనే ఆలోచనతో ఉన్నానని మనసులోని మాటను బయటపెట్టారు కామాక్షి భాస్కర్ల.

also read :మార్కెట్లో సంచులు మోసేవాన్ని – ఈశ్వర్ సాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారో

మొత్తానికి అగధ సినిమాతో వచ్చిన గుర్తింపు కామాక్షి కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా తన నటనపై ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు ఆమెలో మరింత కాన్ఫిడెన్స్ తెచ్చాయని కామాక్షి మాటల్లోనే అర్థమవుతోంది. ఇక అనుష్కతో పోలిక రావడం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కామాక్షి పేరు చర్చకు రావడానికి మరో కారణంగా మారింది. ముందు ముందు ఆమె ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారో చూడాలి.

Tags

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×