E-Paper
Advertisement

Kissik talks: వెంకటేష్ అంటే పిచ్చి.. పాట పాడి మరీ చెప్పిన కామాక్షి!

Kissik talks: వెంకటేష్ అంటే పిచ్చి.. పాట పాడి మరీ చెప్పిన కామాక్షి!
Advertisement

Kisick Talks: బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామాక్షి భాస్కర్ల తన చదువు, చైనాలో ఎదురైన అనుభవాలు, అక్కడి పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చైనాలో చదువుకునే సమయంలో భాష విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అక్కడి ఫుడ్ గురించి కామాక్షి చెప్పిన ఆసక్తికరమైన సంఘటనలు ఏంటో మనమూ చూసేద్దాం.

ఫ్యామిలీ రిలేటివ్స్‌ ఉండటం వల్లే 

తాను చైనాలో మెడిసిన్ చదివినట్లు కామాక్షి చెప్పింది. అసలు ఇండియా నుంచి బయటకు వెళ్లి వేరే దేశంలో చదువుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానంగా… తన ఫ్యామిలీ రిలేటివ్స్‌లో కొంతమంది చైనాలో చదువుకుంటున్నారని, అక్కడ చదువు బాగుంటుందని వాళ్లు చెప్పడంతో తాను కూడా చైనాకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అయితే వెళ్లే ముందు అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో పెద్దగా తెలియదని అసలు విషయం చెప్పుకొచ్చింది.

అసలు సమస్య భాషే

Advertisement

చైనాకు వెళ్లిన తర్వాత అసలు సమస్య భాషేనని కామాక్షి గుర్తుచేసుకుంది. అక్కడ తెలుగు మాట్లాడేవాళ్లు ఉండరని, ఇంగ్లిష్ కూడా అందరికీ అంతగా రాదని చెప్పింది. దీంతో మొదట్లో చాలా కష్టంగా అనిపించిందని, అయితే ఫస్ట్ సెమిస్టర్ నుంచే మాండరిన్ క్లాసులు ఉండటంతో క్రమంగా ఆ భాషను నేర్చుకున్నానని చెప్పింది. మెడికల్ చదువులో కూడా మాండరిన్ ఉపయోగపడేదని, పేషెంట్ హిస్టరీ తీసుకోవడం లాంటి విషయాల్లో ఆ భాష అవసరమయ్యేదని తెలిపింది.

అంతేకాదు… అక్కడ చదువుతో పాటు రోజువారీ జీవితంలో కూడా మాండరిన్ చాలా ఉపయోగపడేదని కామాక్షి చెప్పింది. షాపింగ్‌కు వెళ్లినప్పుడు మాట్లాడటం, ధర తగ్గించమని అడగడం లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఆ భాష అవసరమయ్యేదని వివరించింది.

‘ఐ లవ్ యు’  ఎలా చెప్పాలంటే 

Advertisement

ఇక చైనీస్ భాషలో ఒకబ్బాయికి ‘ఐ లవ్ యు’ చెప్పాలంటే ఎలా చెబుతారు అన్న ప్రశ్నకు సమాధానంగా… జీన్స్ సినిమాలో శంకర్ చైనా వాల్ దగ్గర తీసిన ‘అతిశయం’ పాటలో ఆ పదం వస్తుందని, అదే “వో ఐ నీ… వో ఐ నీ” అంటూ వివరించి నవ్వులు పూయించింది.

అయితే చైనా గురించి మాట్లాడినప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మాత్రం కామాక్షి చెప్పిన మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. అక్కడ కప్పలు, పాములు లాంటి వాటిని కూడా తింటారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ… చైనాలో కొన్ని ప్రాంతాల్లో అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పింది. మొదట్లో అలాంటి విషయాలు చూసినప్పుడు తనకు కూడా డౌట్ వచ్చేదని చెప్పుకొచ్చింది కామాక్షి.

ఇష్టమైన హీరో వెంకటేష్

ఇక తనకు ఇష్టమైన హీరో వెంకటేష్ అని చెప్పిన కామాక్షి… ఆయన సినిమాలోని పాటను కూడా పాడి వినిపించింది. ‘ఇదో రాగం పిలిచింది వేళా… నాలో నిదురించే గతమంతా కదిలేలా’అంటూ పాట పాడుతూ అందరినీ మెస్మరైజ్ చేసింది. వెంకటేష్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన కామాక్షి… ఆ పాటతో తన అభిమానాన్ని మరోసారి బయటపెట్టింది.

also read :Kissik talks:అనుష్కతో పోలికా.. కామాక్షి క్రేజ్ మామూలుగా లేదుగా!

మొత్తానికి చైనాలో మెడిసిన్ చదివిన రోజులను గుర్తుచేసుకున్న కామాక్షి… అక్కడి భాష, చదువు, రోజువారీ జీవితం, ఫుడ్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చైనాలో చదువుకోవాలంటే ముందుగా మాండరిన్ నేర్చుకోవాల్సిందే అన్న కామాక్షి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×