BigTV English

India investments: ఇండియాలోని సంపన్నులు గోల్డ్, క్రిప్టో, స్టాక్స్‌లో డబ్బులు పెట్టరు.. ఎందులో పెడతారో తెలుసా?

India investments: ఇండియాలోని సంపన్నులు గోల్డ్, క్రిప్టో, స్టాక్స్‌లో డబ్బులు పెట్టరు.. ఎందులో పెడతారో తెలుసా?

ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి..? సరైన మార్గంలో పొదుపు చేయాలి, ఆ పొదుపు మదుపులా మారి మనకు అవసరానికి ఉపయోగపడాలి. అంటే పెట్టుబడి సాధనాల్లో డబ్బులు పెట్టాలి. ఆ డబ్బు తిరిగి డబ్బుని సంపాదించేలా చేయాలి. అలాంటి పెట్టుబడి మార్గాలు చాలానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్, బంగారం కొనుగోలు, లేటెస్ట్ గా క్రిప్టో కరెన్సీ కొనుగోలు.. విదేశాల్లో ఎక్కువగా వాడే పెట్టుబడి సాధనాలు ఇవే. కానీ భారత దేశంలో మాత్రం వీటన్నిటికీ మించిన పెట్టుబడి సాధనం ఇంకోటి ఉంది. అదే భూమి. భూమిపై పెట్టుబడి పెట్టినవారెప్పుడూ మోసపోలేదని అంటుంటారు. అది నిజం. భూమిని నమ్ముకుంటే అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్న భూమిని కొనుగోలు చేస్తే.. సమయాన్ని బట్టి దాని విలువ బాగా పెరుగుతుంది.


అన్ని పెట్టుబడి సాధనాల్లోనూ భారతీయులు అధికంగా నమ్మేది భూమినే. సగటు మధ్యతరగతి వ్యక్తులే కాదు, సంపన్నులు కూడా భూమిపైనే పెట్టుబడి పెడుతున్నారు. భారతీయ సంపన్నులు బంగారం, క్రిప్టో కరెన్సీ, స్టాక్స్ వైపు చూడటం లేదని, భూమిపై పెట్టుబడి పెట్టడానికే ఆసక్తి చూపిస్తున్నారని వెల్త్ అడ్వైజర్లు చెబుతున్నారు. అది కూడా అధిక ధర కలిగిన భూములవైపే వారు దృష్టి పెడుతున్నారట.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వీకెండ్ విల్లాలు.. వంటి వాటికి గతంలో డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు సగటు ఇన్వెస్టర్లు వీటిని పెట్టుబడి సాధనాలుగా చూడటం లేదు. అత్యథిక విలువ కలిగిన భూములు.. అంటే రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా డిమాండ్ పెరిగే భూముల్ని వారు ముందుగానే గుర్తించి మదుపు చేస్తున్నారు. బ్రాండెడ్ ఇళ్లు, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే బహుళ అంతస్తుల్ని వారు ప్రిఫర్ చేస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ, ముంబై, గోవాతోపాటు.. దుబాయ్, లండన్ లో కూడా భారతీయులు స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇతర దేశాల్లో భూమిపై పెద్దగా ఇన్వెస్ట్ చేయరు కానీ, అక్కడ కూడా భారతీయులే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగుతున్నారు. భూమిపై పెట్టుబడి పెట్టి, లాభాల్ని ఆర్జిస్తున్నారు.


భారతీయ సంపన్నులు గతంలో స్టాక్ మార్కెట్ వైపు చూసేవారు, లేకపోతే బంగారం కొని దాచుకునేవారు. కానీ నేటితరం మాత్రం వాటికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. భూమిపైనే వారు పెట్టుబడి పెడుతున్నారు. అదికూడా లగ్జరీ విల్లాలు, అధిక ధర ఉన్న ప్రాంతాల్లోనే వారు పెట్టుబడి పెడుతున్నారు. ఎక్కువరేటుకి కొన్నా, రేపు ఎక్కువ లాభానికి అమ్ముకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు.

భారత దేశంలోని ధనవంతుల్లో.. అంటే జనాభాలో 0.001 శాతం మంది భూమిపై పెట్టుబడి పెడుతున్నారు. రూ.75కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర విలువ ఉండే లగ్జరీ భవంతులను కొనుగోలు చేస్తున్నారు. ఇవి కేవలం తమ నివాసానికి మాత్రమే కాదు, భవిష్యత్ లో అదే స్థాయిలో లాభాలు కూడా వాటి ద్వారా ఉంటాయి. ఈరోజు మనం రూ. 25 కోట్ల నుంచి రూ.30కోట్ల విలువ చేసే భూమిని కొంటే.. సమీప భవిష్యత్తులో దాని విలువ రూ.70కోట్ల నుంచి రూ.100 కోట్లకు చేరుకుంటుంది. కొన్నిసార్లు ఆ విలువ మరింతగా పెరుగుతుంది. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు కాక తగ్గదు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×