Bed Room: బెడ్‌రూమ్‌ను తాజాగా, ఉత్సాహంగా మార్చాలని చాలా మంది అనుకుంటారు. కానీ, రూంని ఏ కలర్‌లో పెయిట్ చేయాలో తెలియక సతమతమైపోతారు. కొత్త డెకరేషన్, బెడ్ కలర్ మార్చడం ఒక ఎత్తు అయితే, గది గోడలకు కొత్త రంగు పూసి దాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం మరో ఎత్తు. అయితే, రంగులు కేవలం అందంగా కనిపించడమే కాదు, మానసిక స్థితిని, నిద్రను కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. బేబీ బ్లూ, నేవీ, హంటర్ గ్రీన్ వంటివి ప్రశాంతతను ఇస్తాయి. అలాగే, పసుపు, తెలుపు వంటి రంగులు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందిస్తాయి. ఈ వసంత కాలంలో మీ బెడ్‌రూమ్‌ను రిఫ్రెష్ చేయడానికి ఏ కలర్ అయితే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం..
మావీ బీజ్
మీ గదిని ప్రశాంతమైన స్థలంగా మార్చాలనుకుంటే, మావీ బీజ్ రంగు సరైన ఎంపిక. ఈ వెచ్చని న్యూట్రల్ రంగును చాలా మంది డిజైనర్స్ సిఫారసు చేస్తారు. సూర్యకాంతి పడినప్పుడు ఈ రంగు కొద్దిగా గులాబీ ఛాయలో మెరిసి, గదికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఇది సాయంత్రం రిలాక్స్ అవ్వడానికి సరైన బ్యాక్‌డ్రాప్.
బటర్ యెల్లో
ఉత్సాహవంతమైన వాటితో పాటు సున్నితమైన రంగు కావాలంటే బటర్ యెల్లోను ఎంచుకోవడం ఉత్తమం. క్రీమ్, బ్రౌన్ టోన్‌లతో జత చేస్తే, ఈ రంగు గదిని హాయిగా, శాంతియుతంగా మారుస్తుంది.
పింక్, చాక్లెట్ బ్రౌన్
పింక్, చాక్లెట్ బ్రౌన్ స్ట్రైప్స్‌తో గదికి మోడరన్ టచ్ ఇవ్వొచ్చు. ఈ కాంబినేషన్‌ను గెస్ట్ రూమ్‌లో ఉపయోగించి, న్యూట్రల్ డ్రేపరీ, లైటింగ్‌తో సెట్ చేస్తే రూం ఆకర్షనియంగా మారిపోతుంది. ఈ రంగులు గదిని సున్నితంగా, ఆకర్షణీయంగా చేస్తాయి.
బ్లూ-బ్లాక్
నేవీ కంటే కాస్త లోతైన బ్లూ-బ్లాక్ రంగు గదికి డ్రామాటిక్ లుక్ ఇస్తుంది. డార్క్ కలర్స్‌ని ఇష్టపడే వారు గదిని ఈ రంగుల్లోకి మారిస్తే బెటర్.
లైవ్లీ గ్రీన్
డీప్ ఫారెస్ట్ గ్రీన్ కలర్‌ను బెంజమిన్ మూర్ హెర్బ్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఇది గదికి ఆకర్షణీయమైన, సహజమైన రూపాన్ని ఇస్తుంది. ఈ కలర్‌తో బెడ్ రూం గదులను మారిస్తే చూడడానికి కూడా ట్రెండీగా ఉంటుంది.
ALSO READ: ఇంట్లో అలోవెరా మొక్కలు ఎందుకు పెంచాలో తెలుసా?
పీచీ పింక్
వెచ్చని ఆరెంజ్-పింక్ రంగు గదికి సౌకర్యవంతమైన, అధునాతన రూపాన్ని ఇస్తుంది. కాస్త ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు ఆసక్తి చూపే వారు బెడ్ రూంతో పాటు ఇంటీరియర్‌ను కూడా ఈ కలర్‌కి మార్చేస్తే బెటర్.
మ్యూటెడ్ గ్రీన్
వాటర్ బ్లూ, గ్రీన్ పాలెట్‌తో ప్రైమరీ బెడ్‌రూమ్‌ను ప్రశాంతమైన ట్రీహౌస్‌లా మార్చారు. ఈ రంగు రిలాక్సింగ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
వార్మ్ వైట్
ఫారో& బాల్ పాయింటింగ్ రంగు గదికి వెచ్చని, సున్నితమైన టచ్ ఇస్తుంది. ఈ రంగు ఎర్తీ ఎలిమెంట్స్‌తో కలిసి గదిని హాయిగా, ఆహ్వానించదగిన స్థలంగా మార్చుతుంది.
సాఫ్ట్ బ్లూ
పిల్లల గదికి ఎమీ నెర్ ఎంచుకున్న సమ్మర్ షవర్ రంగు ఉత్సాహకరమైన, టైమ్‌లెస్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది పిల్లలకు సరైన ఎంపిక.