Big Tv Originals: ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తారీఖు రాగానే ఎవరో ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేయకపోతే మనసు అస్సలు ఊరుకోదు. ఇంట్లో అన్నయ్యనో, తమ్ముడినో అక్కనో, చెల్లినో, అమ్మనో, నాన్ననో అదీకాదంటే ఫ్రెండ్ నో ఏప్రిల్ పూల్ చేస్తుంటారు. లేనిదాన్ని ఉన్నది అని నమ్మించి.. ఎదుటి వారిని ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ ఆట పట్టిస్తారు. ఆ రోజంతా ఎవరినో ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, ఏప్రిల్ ఫూల్ అని ఎందుకు అంటారు? ఎప్పటి నుంచి ఈ క్రేజీ సంప్రదాయం అందుబాటులోకి వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఏప్రిల్ ఫూల్స్ డేని ఎందుకు జరుపుకుంటారు?
వాస్తవానికి ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా ప్రారంభం అయ్యిందో ఎవరికీ కచ్చితంగా తెలియదు. కానీ, కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా కాలం క్రితం మార్చి చివరి రోజున నూతన సంవత్సరాన్ని జరుపుకునే వాళ్లు. 1500వ సంవత్సరంలో ఫ్రాన్స్ తన క్యాలెండర్ ను మార్చింది. నూతన సంవత్సరాన్నిమార్చి చివరి రోజు నుంచి జనవరి 1కి షిఫ్ట్ చేసింది. కొంత మందికి ఈ మార్పు గురించి తెలియదు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లను ఎగతాళి చేసేవారు. రానురాను ఇది ఏప్రిల్ 1న ఫూల్స్ డేగా పాటించే వరకు వచ్చింది.
మరోవైపు పురాతన రోమ్ లో హిలేరియా అనే పండుగ ఉండేది. అక్కడ ప్రజలు కొత్త దుస్తులు ధరించి జోకులు చేసుకునే వారు. కొంత మంది ఏప్రిల్ ఫూల్స్ డే ఈ సంప్రదాయం నుండి వచ్చిందని భావిస్తారు. అంతేకాదు, చాలా కాలం క్రితం జెఫ్రీ చౌసర్ అనే రచయిత తన పుస్తకం ‘ది కాంటర్బరీ టేల్స్’లో ఒక జోక్ వేశారట. ఆ జోక్ ను కొంతమంది ఏప్రిల్ ఫూల్స్ డేగా పాటించడం మొదలుపెట్టారని మరికొంత మంది చరిత్రకారులు చెప్తుంటారు. కచ్చితమైన సమాధానం మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు.
ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా జరుపుకుంటారు?
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు.. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులపై చిన్న ఫన్నీ జోక్స్ వేసుకుంటూ, లేనివి ఉన్నట్లు చెప్తూ ఏప్రిల్ ఫూల్స్ డేను ఫన్నీగా జరుపుకుంటారు.
ఏప్రిల్స్ ఫూల్స్ చేసే టిప్స్:
⦿ ఎవరినైనా వారి షూ లేస్ ఊడిపోకపోయినా, ఊడిపోయిందని చెప్పడం.
⦿ చక్కెర డబ్బాలో ఉప్పు ఉందని చెప్పడం.
⦿ అబద్దాలను నిజాలుగా చెప్పడం.
కొన్ని వార్తా పత్రిలకలు, టీవీలు, పెద్ద కంపెనీలు కూడా కొన్నిసార్లు అబద్దాలను నిజాలుగా ప్రచారం చేయడం ద్వారా ఏప్రిల్ ఫూల్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటాయి.
జోకు శ్రుతి మించకుండా చూసుకొండి!
ఏప్రిల్ ఫూల్స్ డే రోజున కొంత మందికి ఎమోషన్స్ తో ఆడుకునే ప్రయత్నం చేస్తారు. తీవ్రమైన విషయాలను చెప్పి ఏప్రిల్ ఫూల్స్ చేయాలని భావిస్తారు. కానీ, కొన్నిసార్లు అలాంటి జోకులు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు జోకులు హర్ట్ చేసేలా ఉండకుండా చూసుకోవడం మంచిది. ఏప్రిల్ ఫూల్స్ చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నం మున్ముందు ఫ్రెండ్షిప్ చెడగొట్టేలా ఉండకుండా జాగ్రత్తపడండి. మీకూ మీ ఫ్రెండ్స్ ను ఏప్రిల్ ఫూల్స్ ను చేయాలనుందా? చిన్న చిన్న జోక్స్ తో చేసేయండి. మరీ ఇబ్బంది పెట్టకండి!
Read Also: బంగాళ దుంపలతో ఇన్ని అనారోగ్యాలా? తప్పు చేస్తున్నామా?