Big Tv Originals: చాలా మంది బంగాలాదుంపలను ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇంతకీ బంగాళాదుంపల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏంటి? అవి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం..
⦿ సోలనిన్ పాయిజనింగ్
సోలనిన్ అనేది ఒక విషపూరిత సమ్మేళనం. ఇది బంగాళాదుంప మీద వెలుతురు పడినప్పుడు డెవలప్ అవుతుంది. దీని వలన ఆకుపచ్చగా మొలకెత్తుతాయి. ఆకుపచ్చ, మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల సోలనిన్ పాయిజనింగ్ జరుగుతుంది. వికారం, వాంతులు, తలనొప్పి, విరేచనాలు, మైకము కలుగుతుంది. పరిస్థితి కాస్త విషమిస్తే, తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దీనిని నివారించడానికి, బంగాళాదుంపలను చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. ఆకుపచ్చగా మారిన లేదంటే మొలకెత్తిన వాటిని పడేయాలి.
⦿ జీర్ణ సంబంధ సమస్యలు
సరిగా ఉడికించని బంగాళాదుంపలు తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి లాంటి జీర్ణ సమస్యలు వస్తాయి. బంగాళాదుంపలోని అధిక పిండి పదార్థాలు జీర్ణక్రియను నిరోధించి, గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది. బంగాళాదుంపలను సరిగ్గా ఉడికించడం వల్ల ఈ ప్రభావాలను తగ్గించవచ్చు.
⦿డయాబెటిస్ ప్రమాదం
బంగాళాదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా పెరుగుదలకు కారణమవుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు చిప్స్ లాంటి ప్రాసెస్ చేసిన ఫుడ్స్ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆలుగడ్డలలో అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియకు ఇబ్బంది కలిగిస్తాయి.
⦿ అలెర్జీ, అసహనం
బంగాళాదుంపలు నైట్ షేడ్ కుటుంబానికి చెందినవి. నైట్ షేడ్ కూరగాయలు సాధారణంగా అలెర్జీ, అసహనం కలిగిస్తాయి. చర్మ దద్దుర్లు, దురద, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది. సున్నితత్వం ఉన్న వ్యక్తులు బంగాళాదుంపలను తినకపోవడం మంచిది.
⦿ హైపర్ కలేమియా
బంగాళాదుంపల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, కండరాల పని తీరును మెరుగుపరుస్తుంది. అయితే, అధిక పొటాషియం తీసుకోవడం హానికరం. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవాళ్లలో అదనపు పొటాషియంను ఫిల్టర్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా హైపర్ కలేమియా ఏర్పడుతుంది. ఫలితంగా క్రమరహిత హృదయ స్పందన, ఛాతీ నొప్పి, కండరాల బలహీనత కలుగుతుంది.
⦿ అక్రిలామైడ్ తయారీ
అక్రిలామైడ్ అనేది క్యాన్సర్ కారక సమ్మేళనం. ఇది బంగాళాదుంపలను అధిక ఉష్ణోగ్రతల వేయించినప్పుడు, కాల్చినప్పుడు ఏర్పడుతుంది. అక్రిలామైడ్ కు ఎక్కువ సేపు గురికావడం వల్ల కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. బంగాళాదుంపలను మరీ ఎక్కువగా ఉడికించడం మంచిది కాదు. అలాగని ఉడికీ ఉడకనివి తినకూడదు.
⦿ఆక్సలేట్ సమస్యలు
బంగాళాదుంపలలో ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు బంగాళాదుంపలు తినడం జాగ్రత్తలు తీసుకోవాలి.
బంగాళాదుంపలను సేఫ్ గా ఎలా వినియోగించాలి?
బంగాళాదుంపలను చల్లని, చీకటి, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. సోలనిన్ పాయిజనింగ్ ను నిరోధించడానికి ఆకుపచ్చ, మొలకెత్తిన బంగాళాదుంపలను తినకూడదు. జీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు చక్కగా ఉడికించాలి. బంగాళాదుంపలను ప్రాసెస్ చేయకపోవడం మంచిది. కిడ్నీ, నైట్ షేడ్ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు తినకపోవడం మంచిది.
Read Also: చికెన్ ఇలా ఉంటే కొనొద్దు.. వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా డేంజర్!