Akkada Ammayi Ikkada Abbayi Trailer : ప్రదీప్ మాచిరాజు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడుగా ఎన్నో సినిమాల్లో కనిపించిన ప్రదీప్ యాంకర్ గా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. అయితే యాంకర్ ప్రదీప్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకర్ ప్రదీప్ కెరియర్ సాఫీగా సాగుతున్న టైంలో తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడం అనేది తనను పర్సనల్ గా చాలా డ్యామేజ్ చేసింది. అవకాశాలు కూడా కొంత మేరకు అప్పట్లో తగ్గాయి. లేకపోతే ప్రదీప్ కేవలం యాంకర్ గానే కాకుండా హీరోగా కూడా తన లెక్కను పరీక్షించుకుంటున్నాడు. ఇదివరకే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఒక సినిమాలో హీరోగా నటించాడు ప్రదీప్. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం మంచి పేరు సాధించాయి. ఈ పాటలు సినిమా మీద మంచి అంచనాలను పెంచాయి. అయితే అంచనాలను సినిమా ఊహించిన స్థాయిలో అందుకోలేకపోయింది.
పవన్ కళ్యాణ్ టైటిల్ తో
ఇక ప్రస్తుతం నితిన్ – భరత్ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రదీప్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని టైటిల్ వినగానే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలతో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ మంచి బిజీగా ఉన్నారు. ఇక పవన్ నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
కంప్లీట్ కామెడీ టచ్
ఇదే టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు యాంకర్ ప్రదీప్. ఈ సినిమా ట్రైలర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. భజగోవిందం అనే ఒక భక్తి పాట తో మొదలైన ఈ ట్రైలర్ చివరి వరకు కూడా చాలా ఆసక్తికరంగా, హాస్య భరితంగా ఉంది అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రదీప్ ఖచ్చితంగా హిట్టు కొడతాడు అని నమ్మకం కలుగుతుంది. కమెడియన్ సత్య ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. భజగోవిందం అనే భక్తి పాటతో మొదలైన ఈ ట్రైలర్ పునరపి మరణం అని సాంగ్తో ఎండ్ అవుతుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పొచ్చు. వాస్తవానికి ఈ ట్రైలర్ అంతా కూడా వినోదపరితంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయితే సక్సెస్ సాధించినట్లే అని చెప్పొచ్చు.
Also Read: Anchor Shiva Jyothi : అక్రమంగా రూ.10 కోట్లు… చిట్టా మొత్తం బయటపెట్టిన నా అన్వేషణ..!