𝐒𝐡𝐚𝐝𝐚𝐛 𝐊𝐡𝐚𝐧 𝐓𝐨 𝐁𝐞 𝐀𝐰𝐚𝐫𝐝𝐞𝐝 By 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧: పాకిస్తాన్ గడ్డపై జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ నేపథ్యంలో షాబాద్ ఖాన్ ( shabad Khan) విజృంభిచాడు. ఆదివారం ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగవ వన్డే సందర్భంగా సూపర్ సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు. ఎనిమిదో వికెట్ కు బరిలోకి దిగిన షాబాద్ ఖాన్ 113 పరుగులు చేసి… ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించాడు. దీంతో మొన్నటి నుంచి షాబాద్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే సూపర్ సెంచరీ చేసి పాకిస్తాన్ జట్టును గెలిపించిన షాబాద్ ఖాన్ పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ఇన్నింగ్స్ లు మరిన్ని ఆడి పాకిస్తాన్ ను అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్దాలని దిశా నిర్దేశం చేశారు. షాబాద్ ఖాన్ అసలు సిసలు మొనగాడు అంటున్నారు.
ఇంగ్లాండ్ జట్టుపై అద్భుతంగా రాణించి పాకిస్తాన్ జట్టును గెలిపించిన షాబాద్ ఖాన్ కు పాకిస్తాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఎనిమిదవ వికెట్ కు బరిలోకి దిగి సెంచరీ చేసినందుకుగాను షాబాద్ ఖాన్ కు ఆ దేశపు రెండో అత్యున్నత పురస్కారం హిలాల్ -ఏ -పాకిస్తాన్ లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం అందుతుంది.
అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. పాకిస్తాన్ ( Pakistan Team) గడ్డపై ఒక్క సెంచరీ చేసినందుకు షాబాద్ ఖాన్ ను ( Shabad Khan) తెగ పొగుడుతున్నారు కదా… వాడి వల్ల చాలా మ్యాచులు పాకిస్తాన్ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఒక మ్యాచ్ బాగా ఆడితే ఇంత డబ్బా కొట్టడం అవసరమా ? అని నిలదీస్తున్నారు. వరల్డ్ కప్ ( World Cup ) గెలిచినంత ఫీల్ అవుతున్నారని ఫైర్ అవుతున్నారు.
ఇంగ్లాండ్ పై విజయం సాధించిన పాకిస్తాన్ క్రికెటర్లు తెగ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అంబటి రాయుడు తన స్టైల్ లో స్పందించారు. ఒక్క మ్యాచ్ గెలిచినందుకు వరల్డ్ కప్ దక్కించుకున్నట్టే ఫీల్ అవుతున్నారు కదరా అంటూ పరువు తీశారు. ఇలాంటి విజయాలు టీమిండియా ఎన్నో సాధించిందని… మీరంతా పిల్ల బచ్చాగాళ్ళు అంటూ చురకలు అంటించారు. ఒక్క విజయానికి అంత ఓవరాక్షన్ అవసరం లేదని సెటైర్లు పేల్చారు.