E-Paper
Advertisement

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. విమాన ప్రయాణికులకు కీలక అలర్ట్!

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. విమాన ప్రయాణికులకు కీలక అలర్ట్!
Advertisement

Ornab Cyclone Air Travel Advisory: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ (Ornab) తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నాయి. తుఫాను ప్రభావం విమాన ప్రయాణాలపై పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాలకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు?

భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, తుఫాను బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చన్నారు. అయితే, తుఫాను దిశ, తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉండటంతో తాజా వాతావరణ హెచ్చరికలను గమనించడం అవసరం.

విమానాలు రద్దయ్యాయా?

Advertisement

తుఫాను నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆందోళన నెలకొంది. అయితే, విమానాలు రద్దయినట్లు అధికారికంగా ప్రకటన లేదు. ప్రయాణికులు తమ విమానాల పరిస్థితిని ముందుగానే చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారు విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, కస్టమర్ కేర్ ద్వారా తాజా వివరాలు తెలుసుకోవాలి.

విమానాశ్రయానికి బయలుదేరే ముందు విమానం సమయానికి నడుస్తుందా? ఆలస్యమైందా? రద్దయిందా? అనే విషయాలను చెక్ చేసుకోవడం మంచిది. వాతావరణం అనుకూలంగా లేకపోతే విమానాల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు.

ఒడిశాలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Advertisement

తుఫాను ప్రభావం నేపథ్యంలో ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు అక్టోబర్ 28న రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో చేపల వేటపై ఆంక్షలు విధించడంతో పాటు, కొన్ని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల ప్రవేశాన్ని పరిమితం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటించాలి.

బెంగాల్‌లోనూ భారీ వర్షాల హెచ్చరిక

అక్టోబర్ 28 నుంచి 30 వరకు పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డార్జిలింగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని తొమ్మిది ఓడరేవుల్లో తుఫాను హెచ్చరిక సంకేతాలు జారీ చేశారు.

ప్రయాణికులు ఏం చేయాలి?

తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. విమాన, రైలు టికెట్ల స్థితిని ముందుగానే చెక్ చేసుకోవాలి. వాతావరణ శాఖ, విమానాశ్రయాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖలు విడుదల చేసే అధికారిక ప్రకటనలను ఫాలో కావడం మంచిది.

Read Also: అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. 60కి పైగా రైళ్లు రద్దు!

Tags

Related News

ఎటుచూసినా బంగారమే బంగారం.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోల్డ్ వాక్‌వే..

కేరళలో రైళ్లపై రాళ్లు విసిరిన ఏపీ వ్యక్తి.. చివరకు ఏమైందంటే?

హాస్టల్ లేదా పీజీలో చేరాలనుకుంటున్నారా? పొరపాటున ఈ తప్పులు చేయకండి

అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. 60కి పైగా రైళ్లు రద్దు!

బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!

రైల్వే ట్రాక్ పై మూడు మృతదేహాలు.. ఏకంగా 80 రైళ్లు రద్దు!

అమెరికాలో అట్టహాసంగా బతుకమ్మ, దసరా వేడుకలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు!

Big Stories

Advertisement
×