E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వానొస్తే చాలు.. పాములు ఇళ్లల్లోకి దూరిపోతాయి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

వానొస్తే చాలు.. పాములు ఇళ్లల్లోకి దూరిపోతాయి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Advertisement

Snake Rain: వర్షాకాలం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు జనం ఇళ్లలోంచి బయటకు రావడానికి కాస్త జంకుతారు. రోడ్డుపై నీళ్లు ఉన్నాయనో, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందనే కాస్త వెనకడుగు వేస్తుంటారు. అయితే అదే సమయంలో పాములు మాత్రం ఊహించని విధంగా బయటకు వస్తుంటాయి. జనావాసాల్లోకి, ఇళ్లల్లోకి చొరబడుతుంటాయి. అసలు వర్షం పడగానే పాములు ఎందుకు అంతలా బయటకు వస్తాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఆవాసాలు మునిగిపోవడం వల్లే..

భారీ వర్షాలు పడినప్పుడు పాములు నివసించే భూగర్భ బిలాలు, పుట్టలు, చెట్ల తొర్రలు నీటితో నిండిపోతాయి. దీంతో ఊపిరాడక, ప్రాణాలు కాపాడుకోవడానికి అవి తమ సురక్షిత ప్రాంతాల నుండి బయటకు రావాల్సి వస్తుంది. వరద నీరు వాటి సహజ ఆవాసాలను ముంచేయడంతో అవి తలదాచుకోవడానికి పొడి ప్రదేశాల కోసం వెతుకుతూ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంటాయి.

ఎండలోనే ఎందుకు కనిపిస్తాయి?

Advertisement

భారీ వర్షం పడి తగ్గిన తర్వాత.. ఒక్కోసారి వెంటనే ఎండ వస్తుంది. ఆ సమయంలో పాముల సంచారం మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి శాస్త్రీయ కారణం ఉందని నిపుణులు అంటున్నారు. పాములు సహజంగా శీతల రక్త జంతువులు (Cold-blooded animals). అవి తమ శరీర ఉష్ణోగ్రతను స్వయంగా నియంత్రించుకోలేవు. వర్షానికి వాటి శరీరం చల్లబడిపోతుంది. అందుకే ఎండ రాగానే ఆ వేడిని తట్టుకోవడానికి శరీరాన్ని వెచ్చగా చేసుకోవడానికి (Basking) అవి రోడ్ల మీదకు, ఖాళీ ప్రదేశాల్లోకి వచ్చి సేద తీరుతుంటాయి.

ఆహారం వేటలో భాగంగా..

మరోవైపు వర్షాలు పడగానే కప్పలు, ఎలుకలు, కీటకాలు బయటకు రావడం సహజం. అయితే పాములకు ఇవే ముఖ్యమైన ఆహారం. కాబట్టి కప్పలు, ఎలుకలు ఇళ్ల పరిసరాల్లోకి చేరినప్పుడు పాములు కూడా వాటిని వేటాడుతూ ఒక్కోసారి ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇళ్ల చుట్టూ ఉండే చెత్తాచెదారం, కట్టెల మోపులు వీటికి మంచి వేట స్థలాలని నిపుణులు చెబుతున్నారు.

సంతానోత్పత్తి కోసం..

Advertisement

సాధారణంగా వసంతం (Spring), వేసవి కాలం ప్రారంభంలో పాముల సంచారం విపరీతంగా పెరుగుతుంది. శీతాకాలం అంతా నిద్రావస్త (Hibernation)లో దాక్కున్న పాములు.. వాతావరణం వేడెక్కగానే ఒక్కసారిగా బయటకు వస్తాయి. పైగా ఈ కాలంలోనే పాములు పిల్లలను పెట్టేందుకు ప్రయత్నిస్తాయి. భాగస్వామి కోసం వెతికే క్రమంలో అవి చాలా చురుగ్గా కదులుతుంటాయి. ఈ సమయంలోనే వర్షాలు పడటం వల్ల.. అవి తరుచూ కనిపిస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: రోజుకు 3GB డేటా + ఫ్రీ నెట్‌ఫ్లిక్స్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలంలో పాముల సంచారం అధికంగా ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు, పొలాలు, అడవులకు దగ్గర నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉంటాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ పొదలు, చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలుకుతున్నారు. రాత్రి పూట నడిచేటప్పుడు ఖచ్చితంగా టార్చ్ లైట్ వాడలని.. తలుపుల కింద సందులు లేకుండా చూసుకోవాలని పేర్కొంటున్నారు.

Also Read: వీఐ సరికొత్త ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 1800GB డేటా, అపరిమిత కాల్స్!

Related News

వాషింగ్ మెషీన్‌లో షూస్ వేస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

చున్నీ అంటే కేవలం మెడ చుట్టూ వేసుకోవడం కాదు.. ఇలా 6 రకాలుగా వేస్తే స్టైలిష్ లుక్

వీళ్లకు జీవితం ఒక చదరంగం.. ఈ తేదీల్లో పుట్టినవారికి మాస్టర్‌మైండ్ తెలివి ఓడించడం చాలా కష్టం

పెంపుడు కుక్కలు, మనుషులే టార్గెట్.. వెలుగులోకి భయంకరమైన ఫాక్స్ టేప్‌వార్మ్!

చాణక్య నీతి.. జీవితంలో ఈ 4 రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు.. చెబితే తీవ్ర నష్టం

చూడగానే వావ్ అనిపిస్తుంది.. తక్కువ ఖర్చు, చిన్న మార్పులతో మీ కిచెన్‌కు మోడ్రన్, లగ్జరీ లుక్

పురుషుల కంటే మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువ? దీనికి కారణాలు ఇవే

Big Stories

×