E-Paper
Advertisement

సలాడ్లు, మొలకలు అందరికీ పడవా? మీ పొట్టను ఇబ్బంది పెట్టే ‘ఆరోగ్యకరమైన’ ఆహారాలు ఇవే!

సలాడ్లు, మొలకలు అందరికీ పడవా? మీ పొట్టను ఇబ్బంది పెట్టే ‘ఆరోగ్యకరమైన’ ఆహారాలు ఇవే!

Digestive Issues: కరోనా మహమ్మారి నేర్పని పాఠం వలన ప్రస్తుతం చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. అందుకోసం ప్రోటీన్ బార్స్, మొలకెత్తిన గింజలు, పచ్చి సలాడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను డైట్‌లో చేర్చుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచివని భావిస్తారు. అయితే ఇలాంటి మేలు చేసే ఆహారాలు తిన్నప్పటికీ కొంతమందిలో కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. మంచి ఆహారం తిన్నా ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందామా..

హెల్దీ ఫుడ్‌తో ఎందుకు ఇబ్బంది?

సాధారణంగా ఫైబర్ (పీచుపదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణక్రియకు మంచివని చెబుతారు. కానీ, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి లేదా ఐబీఎస్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇవి జీర్ణం కావడం కాస్త కష్టంగా మారుతుంది. ముఖ్యంగా పచ్చి కూరగాయలతో చేసే సలాడ్లు, ప్రొటీన్ బార్స్, కొన్ని రకాల పప్పుధాన్యాలను మన శరీరం ఒక్కసారిగా అరిగించుకోలేదు. వీటిని డైట్‌లో హఠాత్తుగా చేర్చడం వల్ల లేదా ఎక్కువగా తినడం వల్ల కడుపులో అసౌకర్యం, భారంగా అనిపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

గుట్ మైక్రోబయోమ్ పాత్ర:

మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా (మైక్రోబయోమ్) మనం తినే పీచుపదార్థాలను పులియబెట్టడం ద్వారా జీర్ణం చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరానికి మేలు చేసే సమ్మేళనాలు విడుదలవుతా యి. అయితే, అందరి శరీర తత్వం ఒకేలా ఉండదు. కొందరిలో ఈ పులియబెట్టే ప్రక్రియ సరిగ్గా జరగక, గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పొట్ట ఉబ్బినట్లు అనిపిస్తుంది. అందుకే ఒకరికి పడిన ఆహారం మరొకరికి పడాలని లేదు. జీర్ణ ఆరోగ్యం అనేది పూర్తిగా వ్యక్తిగతం.

Also Read: ఐస్ రోలర్స్ నిజంగానే ముఖంపై రంధ్రాలను తగ్గిస్తాయా? డెర్మటాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే?

అతిగా ప్రొబయోటిక్స్ తీసుకోవద్దు:

పెరుగు, కెఫిర్ వంటి పులియబెట్టిన పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయన్నది నిజమే. అయితే, వీటిని కూడా హఠాత్తుగా లేదా అతిగా తీసుకోవడం వల్ల సున్నితమైన పొట్ట ఉన్నవారిలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్యాక్ చేసిన కొన్ని హెల్దీ స్నాక్స్‌లో ఉండే కృత్రిమ పదార్థాలు కూడా జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రకటనల్లో చూసి అన్ని హెల్దీ స్నాక్స్ మన శరీరానికి సరిపోతాయని అనుకోవడం పొరపాటు.

సమస్య నుంచి బయటపడటం ఎలా?

ఈ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే డైట్‌లో మార్పులు నెమ్మదిగా చేయాలి. ఫైబర్ ఉండే ఆహారాలను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా అలవాటు చేసుకోవాలి. రోజంతా తగినంత నీరు తాగడం ఎంతో ముఖ్యం. ఏ ఆహారం తిన్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందో గమనించి, వాటిని కాస్త తగ్గించాలి. ట్రెండ్స్ ఫాలో అవుతూ అందరూ తినే హెల్దీ డైట్‌ను కాకుండా, మీ శరీర తత్వానికి ఏది సరిపోతుందో తెలుసుకుని తినడమే నిజమైన ఆరోగ్యం.

Also Read: టీనేజర్లను నెమ్మదిగా కుంగదీస్తున్న ‘టెక్స్ట్ నెక్’ ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!

Related News

వేసవిలో కూడా చర్మం ఉంటుంది కూల్ కూల్.. ఈ స్కిన్‌కేర్ జాగ్రత్తలే ఉపాయం

ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన మ్యాజికల్ ఫుడ్.. కొబ్బరి పువ్వుతో ఇన్ని లాభాలా?

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తరువాత ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు

మీ మనసే మీకు అతిపెద్ద శత్రువు.. మీ తప్పుడు నిర్ణయాలకు కారణాలు అదే

ఒక్క రోజులో మూడు ఋతువుల ఫీలింగ్.. వేసవిలో టూర్ వెళ్లడానికి అద్భుతమైన లొకేషన్

భగవాన్ విష్ణుకు చెందిన 25 పేర్లతో మీ బిడ్డకు ప్రత్యేక గుర్తింపు.. వీటి అర్థాలు తెలుసా

వేసవిలో స్టైలిష్‌గా, కూల్‌గా కనిపించాలా? క్లాసీ, కంఫర్ట్‌గా కనిపించేందుకు ఫ్యాషన్ టిప్స్

Big Stories

×