BigTV English

Ice Cream: ప్రపంచంలోనే వింత ఐస్ క్రీమ్.. దొరకడమే కష్టం.. లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ice Cream: ప్రపంచంలోనే వింత ఐస్ క్రీమ్.. దొరకడమే కష్టం.. లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ice Cream: ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండ నుంచి ఉపశమనం కోసం చల్ల చల్లని ఐస్ క్రీంమ్‌లు లాగించేస్తుంటారు. మార్కెట్లో రకరకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు అందుబాటులో కూడా ఉన్నాయి. ఒకప్పుడు సీజనల్‌గా మారే ఐస్‌క్రీమ్‌లు ఇప్పుడు ఎవర్ గ్రీన్‌గా మారాయి.


సాధారణంగా ఐస్‌క్రీమ్ పాలు, పంచదార, మిల్క్ పౌడర్ వంటివి ఉపయోగించి తయారు చేస్తుంటారు. అయితే ఈ విషయం మీకు తెలుసా? సముద్రపు నాచుతోటి కూడా ఐస్‌క్రీమ్ తయారు చేస్తారట. షాకింగ్ గా ఉంది కదూ.. అవును.. మన ఆరోగ్యానికి, వ్యవసాయానికి, ఇతర రంగాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.

సముద్రపు నాచును ఎక్కువగా ఐస్‌క్రీమ్ తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే నేరుగా కాదు.. అందులోని కొన్ని ముఖ్యమైన పదార్ధాలు వాడతారు. ఇందులో ముఖ్యంగా కేరిజినల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది ఒక జెల్‌లా పనిచేస్తుంది.


సముద్రపు నాచు నుండి క్యారేజీన్‌ను తీయడానికి.. ముందుగా నీటితో శుభ్రం చేసి, ఇసుక, చెత్తను తొలగిస్తారు. ఆ తర్వాత దానిని పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో వేసి ఉడకబెడతారు. జెల్ లాగా తయారు అవుతుంది. దీన్ని మరొక సారి నీటితో కడిగి ఎండబెట్టి, మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని ఆల్కాహాల్ లేదా పొటాషియం క్లోరైడ్‌తో ప్రాసెస్ చేస్తారు. ఈ జెల్‌ను మళ్లీ ఎండబెట్టి, పొడిగా చేసి, ప్యాక్ చేస్తారు. ఇవి పలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ క్యారేజీనన్ పౌడర్‌ను ఐస్ క్రీమ్‌లలోను, కేక్‌లలో ఉపయోగిస్తుంటారు. దీనిని ముఖ్యంగా ద్రవాలను తయారుచేయడంలో ఉపయోగిస్తుంటారు. మీరు చీజ్ కేక్ లాంటివి తయారు చేయాలనుకుంటే జెలిటిన్ బదులు క్యారేజీనన్ పౌడర్‌ను ఉపయోగించివచ్చు.

సముద్రపు నాచు వల్ల ఉపయోగాలు..
సముద్రపు నాచును ఆహార పదార్ధాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటిలో ఐరన్, ఐయోడిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి, ఇ, కె వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

సముద్రపు నాచులో ఐయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను అధికంగా ఉంటాయి.

వ్యవసాయ ఉపయోగాలు
సముద్రపు నాచుతో తయారయ్యే ఎరువులు నేల శ్రేష్టతను పెంచుతాయి. ఇందులో ఉండే నాచురల్ హర్మోన్లు మొక్కల పెరుగుదలకు దోహదపడతాయి.

పారిశ్రామిక రంగాల్లో ఉపయోగాలు
మాస్క్‌లు, ఫేసియల్స్, షాంపూలలో సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు.

అంతేకాదు అల్జినేట్స్, అగార్, బిస్కెట్లు, పాస్తా, నూడిల్స్ వంటి పదార్ధాల్లో సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు.

Also Read: కొబ్బరి నీళ్లు సూపర్ డ్రింక్.. వీటిలోని పోషకాల గురించి తెలుసా ?

ఇది ఎక్కువగా ఐర్లాండ్, అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రదేశాల్లో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లోను సముద్రపు నాచుకు ప్రాధాన్యత పెరుగుతోంది. అలాగే, తూర్పు గోదావరి జిల్లాలో దీని సాగు మొదలైంది. కేంద్రం పీఎం యోజన కింద సీ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. దీనిని ఎక్కువగా జపాన్, చైనాలో ఆహారంగా తీసుకుంటారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×