OTT Movie : ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు క్యూ కడుతున్నాయి. ప్రేక్షకులు కూడా డిఫెరెంట్ స్టోరీలను చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, మూడవ ప్రపంచ యుద్ధం కూడా చూపించేశారు. ఈ సినిమా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. యుద్ధంతో పాటు, ఒక లవ్ స్టోరీ కూడా ఆసక్తికరంగా తిరుగుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
భారతదేశం అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడని కారణంగా, 2028లో ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటుంది. మరోవైపు చైనా, రష్యా వంటి దేశాలు ఐక్యరాజ్య సమితి నుండి బయటకు వచ్చి, ‘రిపబ్లిక్’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఇది ‘ONOR’ అనేకొత్త కూటమిని స్థాపిస్తుంది. భారతదేశం ఈ కూటమిలో చేరకపోవడంతో, ONOR సంబంధాలు ఉన్న కంపెనీలపై దాడులు జరుగుతాయి. దీనిలో తమిళనాడు ముఖ్యమంత్రి GNR బంధువైన నటరాజన్ అరెస్టు అవుతాడు. ఇదే సమయంలో, GNR కుమార్తె కీర్తన, వైల్డ్‌లైఫ్ స్పెషలిస్ట్ తమిళ్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం కీర్తన తండ్రి నటరాజన్ కు తెలిసిపోతుంది. ఈ లవ్ స్టోరీకి వ్యతిరేకంగా ఉన్న నటరాజన్, తమిళ్‌ను చంపాలని పథకం వేస్తాడు.
అయితే ఇంతలోనే మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం టెక్నాలజీతో ఎక్కువగా జరుగుతుంది. ONOR దక్షిణ భారతదేశాన్ని చాలా వరకూ స్వాధీనం చేసుకుంటుంది. ఈ సంక్షోభంలో తమిళ్, నటరాజన్ ఇతరులు తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఐక్యంగా పోరాడాల్సి వస్తుంది. మరి ఇందులో తమిళ్, నటరాజన్ తమ భూములను తిరిగి పొందుతారా ? మూడవ ప్రపంచ యుద్ధం కారణంగా ఎటువంటి పరిణామాలు జరుగుతాయి ? కీర్తన, తమిళ్ ల లవ్ స్టోరీ చివరికి ఏమౌతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : చంపిన వాళ్లే తిరిగొచ్చి టార్చర్ చేస్తే… ఇలాంటి సైకో కిల్లర్ మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కడైసి ఉలగ పోర్’ (Kadaisi Ulaga Por). 2024 లో విడుదలైన ఈ మూవీకి హిప్‌హాప్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2028 సంవత్సరంలో జరిగే ఒక డిస్టోపియన్ భవిష్యత్తు నేపథ్యంలో సాగుతుంది. ఈ తమిళ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.