Wife and Husband Relationship Tips: భార్యా భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. అంతే కాకుండా భార్యా భర్తలు చేసే పనులు, చెప్పే మాటలు వారి బంధాన్ని నిలబెడతాయి. కొన్ని పనులు చేయడం వల్ల, చెప్పడం వల్ల బంధాలు బలహీనపడతాయి. ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది కూడా తెలిసి ఉండాలి. కాబట్టి భార్యలు భర్తలతో ఏం చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు
భర్తను భార్య నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదని అసలు చెప్పకూడదు. అలా తరచూ చెప్పడం వల్ల భర్తలకు నిరాశ కలుగుతుంది. ఇద్దరి మధ్య బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. అలా అనడం ఇద్దరి మధ్య ఒక మంచి సంభాషణకు ఆటంకం కలిగించవచ్చు.
నీ లాంటి వాన్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు
కొన్నిసార్లు కోపం రావడం సహజం. కానీ ఆ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇద్దరికీ మంచిది. అలా కోపం వచ్చిన సందర్భంలో కొంతమంది తమ భర్తలను నీ లాంటి వాన్ని పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోలేదని అంటారు. ఈ మాటతో భార్యకు అసలు తానంటే ఇష్టం లేదేమో అనే భావన కలుగుతుంది.
నీతో ప్రయాణమే నచ్చడంలేదు
నీతో ప్రయాణమే నచ్చడం లేదని కొంతమంది అంటుంటారు. ఇది చాలా పెద్ద మాట. ఈ మాటతో వారి బంధమే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ఒక్కమాటతో అప్పటి వరకు ఉన్న సంతోషకరమైన జీవితంపై, జీవిత భాగస్వామిపై అనుమానం వస్తుంది. కాబట్టి ఇలాంటి మాటలు భర్తతో అస్సలు అనకూడదు.
నువ్వు ఒక అసమర్దుడివి
భర్త ఏదైనా రంగంలోనో, వృత్తిలోనో రాణించలేకపోతే ప్రోత్సహించాలి కానీ అవమానపర్చకూడదు. వీలైతే అండగా ఉండి భుజం తట్టాలి. కానీ కొంతమంది అసమర్దుడివి అంటూ భర్తను అతని ముందే అంటుంటారు. దీంతో తన భర్యే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారనే భావన భర్తలో కలిగి డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు.
మీ కుటుంబం సభ్యులు చెడ్డవారు
కొంతమంది భార్యలు భర్తల కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండకుండా గొడవలు పడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల వారి బంధం కూడా బలహీనపడుతుంది. తనను పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా చూసుకున్న కుటుంబ సభ్యులను భార్య తిట్టడాన్ని భర్త అస్సలు తీసుకోలేడు.