BigTV English

Naga Vamsi : దమ్ముంటే నన్ను బ్యాన్ చేయండి… నేను చేసేది నేను చేస్తా…

Naga Vamsi : దమ్ముంటే నన్ను బ్యాన్ చేయండి… నేను చేసేది నేను చేస్తా…

Naga Vamsi : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ నాగ వంశీ (Suryadevara Nagavamsi) తాజాగా రివ్యూ రైటర్ ల పై విరుచుకుపడ్డారు. ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) మూవీపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ తాజా ప్రెస్ మీట్ లో ఆయన సీరియస్ అయ్యారు. అంతేకాకుండా తన సినిమాలను బ్యాన్ చేయమంటూ సవాల్ విసిరారు.


రివ్యూ రైటర్ లకు నాగ వంశీ స్ట్రాంగ్ వార్నింగ్  

మార్చ్ 28న రిలీజ్ అయిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ మొదటి మూడు రోజుల్లోనే మంచి కలెక్షన్లను రాబట్టింది. 2023లో రిలీజ్ అయిన హిట్ మూవీ ‘మ్యాడ్’కు సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ మరోసారి తమ కామిడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీని సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ మూడు రోజుల్లోనే 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మొదటి రోజే 20.8 కోట్లు, రెండవ రోజు 16.4 కోట్లు, మూడవరోజు 13 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ.


ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్మాత నాగ వంశీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ కొంతమంది సినిమాపై కావాలనే నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారి గురించి ఆయన మాట్లాడుతూ “ఈ సినిమా ఇండస్ట్రీలో నేనూ, మీరూ కో ఎగ్జిస్ట్ కావాలి. నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ నడుస్తుంది. నేను ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ నడుస్తుంది. మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగానీ సినిమాను చంపేయాలి అని ప్రయత్నించకండి. ఆల్రెడీ మూవీ రిలీజ్ కి ముందే మేము స్టోరీ లేదు, లాజిక్స్ వెతకొద్దు అని చెప్పాము. అయినప్పటికీ ప్రేక్షకులు హ్యాపీగా థియేటర్లకు వస్తుంటే మూవీలో కథ లేకపోయినా కలెక్షన్లు రావడం ఏంటి ? అంటూ కొంతమంది కావాలని సినిమాను చంపే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ఆడుతున్నప్పుడు కూడా… ఎందుకు ఆడుతుంది ? అని మీ అనాలసిస్ జనాలకు అక్కర్లేదు. సినిమా ఆడితేనే మీరూ ఉంటారు, లేదంటే వెబ్సైట్ మూసేసుకొని ఇంటికి వెళ్ళాలని గుర్తు పెట్టుకోండి” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బ్యాన్ చేయమంటూ సవాల్ 

ఇదే ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా మాట్లాడుతూ “మా మీద అంతగా పగ ఉంటే, దమ్ముంటే మా సినిమాలను బ్యాన్ చేయండి. నేను ఇంత కామెంట్ చేశాను కదా… నా సినిమాలను బ్యాన్ చేయండి.  నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఓపెన్ గా చెబుతున్నా నా సినిమాలను బ్యాన్ చేయండి. నేను సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో అలాగే చేసుకుంటాను. వెబ్సైట్లో అప్లోడ్ చేసేనే సినిమాలు ఆడట్లేదు కదా?” అంటూ మండిపడ్డారు. అయితే ఇదంతా ఆయన ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×