BigTV English

Women desire : వివాహం తర్వాత శృంగారంపై మహిళలకు ఆసక్తి ఎందుకు తగ్గిపోతుందో తెలుసా?

Women desire : కొందరు పురుషులకు లైంగిక వాంఛలు తక్కువగా ఉండడం లేదా.. సెక్స్ పట్ల వారు ఆసక్తి చూపకపోవడం అనేది తరుచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య మహిళల్లో కూడా ఉంటుంది. కానీ వారు ఇలాంటి సమస్యలను బయటకి చెప్పేందుకు ఇష్టపడరు.

Women desire : వివాహం తర్వాత శృంగారంపై మహిళలకు ఆసక్తి ఎందుకు తగ్గిపోతుందో తెలుసా?

Women desire : కొందరు పురుషులకు లైంగిక వాంఛలు తక్కువగా ఉండడం లేదా.. సెక్స్ పట్ల వారు ఆసక్తి చూపకపోవడం అనేది తరుచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య మహిళల్లో కూడా ఉంటుంది. కానీ వారు ఇలాంటి సమస్యలను బయటకి చెప్పేందుకు ఇష్టపడరు. పైగా వారి సంసార జీవితంలో తరుచూ గొడవలకు ఈ సమస్యే పెద్ద కారణం.


మగవారిలో ఏమైనా లోపం ఉంటే వారి భార్యలు ఎలాగైతే అసంతృప్తితో ఉంటారో.. అలాగే మహిళలు శృంగారం పట్ల అనాసక్తిగా ఉంటే వారి భర్తలు కూడా చిరాకు పడతారు. ఈ విషయం బయటికి చెప్పలేక ఇంట్లో చిన్న చిన్న కారణాల చూపుతూ ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. స్త్రీలలో వివాహం తరువాత శృంగారం పట్ల ఆస‌క్తి కోల్పోవడానికి కొన్ని కారణాలున్నాయి.

శృంగార కోరికలు తగ్గిపోవడం అనేది ఒక మహిళ లైంగిక బలహీనతను సూచిస్తుంది ఇది ఒక సాధారణ లక్షణమే. పురుషులకు అంగస్తంభన లోపం లాంటిదే ఇది కూడా. వారిని ఎంత ప్రేరేపించినా, సెక్స్ చేయాలనే కోరిక వారిలో కలుగదు. శారీరక బలహీనత వల్ల శృంగార సమయంలో అలాంటి మహిళల్లో ఉత్సాహం ఉండదు.


డిప్రెషన్, నిరుత్సాహం, ఆందోళన వంటి మానసిక సమస్యలు, భావోద్వేగంగా ఉండడం లేదా గతంలో లైంగిక హింస లాంటి చెడు అనుభవాలు కూడా మహిళల్లో లైంగిక బలహీనతకు కారణమవుతాయని నిపుణులు అభిప్రాయం. ఉదాహరణకు అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఘటనలు లైంగిక కోరికలను ప్రభావితం చేస్తాయి.

అలాగే చాలా మంది మహిళలను వారి జీవిత భాగస్వామిగా పురుషులే హేళన చేస్తూ.. వారు అందంగా లేరని వేరొకరిని ఉదాహరణగా చూపుతుంటారు. ఇలాంటి సందర్భాలలో స్త్రీలు తాము అందంగా లేమని, లావుగా ఉన్నామని లేదా బాడీ ఫిగర్, ఫిట్‌నెస్ లేదని ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటారు. దీంతో వారు జీవితంలో లైంగిక సుఖం పట్ల అనాసక్తిగా ఉంటారు.

మరికొందరికి భాగస్వామితో సాన్నిహిత్యం సమస్య ఉంటుంది. అలాంటి స్త్రీలలో కూడా లైంగిక కోరికలు కలుగవు. తగినంత ప్రేమ లభించకపోవడం వల్ల ఎప్పుడూ బాధపడుతూ.. ఉల్లాసం భరితమైన జీవితాన్ని దూరమవుతారు.

గుండె జబ్బులు, థైరాయిడ్, కిడ్నీ, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా సెక్స్ పట్ల కోరిక ఉండదు. అలాగే గర్భవతిగా ఉన్న సమయంలో లేదా ప్రసవం తరువాత కూడా ఈ సమస్య ఉంటుంది. ప్రసవ సమయంలో యోని విపరీతంగా సాగడం, కోతలు, కుట్లు పడడమే దీనికి కారణం.

చంటి పిల్లలకు పాలిచ్చే సమయంలో మహిళ జననాంగాలు పొడిబారిపోతాయి. దీంతో సెక్స్ హార్మోన్ల అసమతుల్యత, లిబిడో లేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మద్యపానం, సిగరెట్ స్మోకింగ్, డ్రగ్స్ వంటి చెడు అలావాట్లు ఉన్న మహిళల్లో సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉంటుంది.

అలాగే ఉద్యోగం లేక పని ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయి శరీరంలో పెరుగుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్.. సెక్స్ హార్మోన్లు తగ్గిపోతాయి.

పై తెలిపిన కారణాలు కాకుండా ఇతర సమస్య ఉన్నట్లయితే ఎటువంటి సంకోచం లేకుండా, సిగ్గు పడకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే శృంగారంలో పాల్గొనడమనేది మంచి ఆరోగ్య లక్షణం. తరుచూ సెక్స్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×