Consumer rights for online shopping: ఆన్ లైన్‌లో.. ఎంతో ఆశగా ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ డ్యామేజ్‌తో వస్తే.. ఇక మన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే అని చాలా మంది బాధపడి పోతుంటారు. వస్తువును వెంటనే.. రిటర్న్ లేదా రీప్లేస్ చేయడం ఒక్కటే మార్గమని భావిస్తారు. కానీ.. కంపెనీలు వాపసు తీసుకోవడానికి నిరాకరిస్తే లేదా ఫేక్ ప్రొడక్ట్స్ వస్తే మన చేతిలో.. బలమైన చట్టపరమైన హక్కులు ఉంటాయని మీకు తెలుసా? ఇలాంటి సమయంలో కేవలం.. రిటర్న్ చేయడమే కాకుండా కస్టమర్ల ఏయే హక్కులను ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం.
కొనే వస్తువులో.. లోపం వల్ల మీకు లేదా మీ ఇంటికి ఏదైనా.. నష్టం జరిగితే.. ఈ-కామర్స్ సంస్థల నుంచి పూర్తి నష్టపరిహారం కోరే హక్కు మీకు ఉంటుంది. కేవలం వస్తువు ధర మాత్రమే కాకుండా.. దాని వల్ల జరిగిన మానసిక , ఆర్థిక నష్టానికి కూడా క్లెయిమ్ చేయవచ్చు.
ప్రొడక్ట్ రిటర్న్ చేసిన తర్వాత.. చాలా రోజులు గడిచినా మీ డబ్బులు రిఫండ్ చేయకపోతే..ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్‌లు నిబంధనల ప్రకారం.. ఆలస్యానికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ లో ఫిర్యాదు చేయొచ్చు.
ఆన్‌లైన్‌లో చూపించిన ఫీచర్లకు.. ఇంటికి వచ్చిన వస్తువుకు ఏమాత్రం పొంతన లేకపోతే అది ‘అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్’కిందకు వస్తుంది. దీనిపై కన్స్యూమర్ ఫోరమ్‌లో.. కేసు వేసి కంపెనీకి జరిమానా విధించేలా చేయొచ్చు.
4.డెలివరీలో ఆలస్యం:
వస్తువును ఆర్డర్ చేసేటప్పుడు.. కంపెనీ పేర్కొన్న డెలివరీ తేదీకి లేదా గడువుకు చాలా రోజులు ఆలస్యంగా ప్రొడక్ట్ అందిస్తే.. ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకుని పూర్తి రీఫండ్ పొందే హక్కు మీకు ఉంటుంది. ఒక వేళ క్యాన్సిలేషన్ చార్జీలు విధిస్తామన్నా లేదా రీఫండ్ ఇవ్వడానికి నిరాకరించినా అది నిబంధనలకు విరుద్ధం అవుతుంది.
ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ లేదా వెబ్‌సై ట్లు మన పర్సనల్ వివరాలను, ఫోన్ నంబర్లను.. ఇతర మార్కెటింగ్ సంస్థలకు అమ్మడానికి వీలు లేదు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం కస్టమర్ల డేటా పూర్తి సేఫ్‌గా ఉంటుంది. అందుకే నమ్మకమైన సైట్ లలో మాత్రమే షాపింగ్ చేయడం ఎప్పటికైనా మంచిది.
Also Read:ఆన్‌లైన్ షాపింగ్ చేసే..99 % మందికి తెలియని విషయాలు!
ప్రతి ఈ-కామర్స్ కంపెనీ తమ ప్లాట్ ఫారమ్‌లో కస్టమర్ల సమస్యలను పరిష్కరించడానికి కచ్చితంగా ఒక ‘గ్రీవెన్స్ ఆఫీసర్’వివరాలను అందుబాటులో ఉంచాలి. మీ సమస్యను కస్టమర్ కేర్ పరిష్కరించకపోతే.. నేరుగా ఆ గ్రీవెన్స్ ఆఫీసర్‌కు మెయిల్ ద్వారా రాతపూర్వక ఫిర్యాదు చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పరిష్కారం పొందొచ్చు.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రొడక్ట్ బాక్స్‌ను ఓపెన్ చేసే వీడియో తీసుకోవడం, ఇన్‌వాయిస్/ బిల్లును సేవ్ చేసుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ వినియోగదారు హక్కులను మరింత బలంగా నిరూపించుకోవచ్చు.
కంపెనీలు మీ సమస్యను పరిష్కరించకపోతే మౌనంగా ఉండకండి.నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) టోల్-ఫ్రీ నంబర్ 1915 కి కాల్ చేసి లేదా వారి అధికారిక పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి మీ హక్కులను సాధించుకోండి