స్త్రీకి అందంగా ఉండాలన్న కోరిక అధికంగా ఉంటుంది. ముఖంలో కాంతి, మెరిసే జుట్టే అందానికి ఇప్పుడు కొలమానాలుగా మారాయి. కానీ వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి. అలసట కూడా పెరిగిపోయినట్టు కనిపిస్తుంది. చర్మం కూడా కాంతిహీనంగా మారుతుంది. కాబట్టి ఇలా కాంతివిహీనం అవుతున్న ముఖాన్ని మీరు మళ్ళీ అందంగా మార్చుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బయట వైపు నుంచే కాదు… అంతర్గతంగా కూడా చర్మాన్ని పోషించాల్సిన అవసరం ఉంది. ఇందుకు మీరు కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ ను ప్రతిరోజు తినాలి.
మహిళలు ఇక్కడ మేము చెప్పిన ఆహారాలలో ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. కేవలం 10 రోజుల్లోనే మీ ముఖంలో కాంతి కనిపించడం మొదలవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఏం తినాలో చదవండి.
వాల్ నట్స్
ప్రతిరోజు వాల్నట్స్ రెండు నుంచి నాలుగు రాత్రి నానబెట్టుకొని ఉదయం లేచి తినండి. ఇలా వాల్నట్స్ తినడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. వీటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. చర్మంలోని తేమను కాపాడడానికి ఇవి సహాయపడతాయి. అంతేకాదు ఇవి యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పని చేస్తాయి. అలాగే వాల్నట్స్ లో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు చర్మం ప్రకాశవంతంగా కూడా మారుతుంది. మీరు ప్రతిరోజు రెండు నుంచి నాలుగు వాల్నట్స్ తింటే జుట్టు కూడా బలపడుతుంది. అలాగే మెదడుకు కూడా ఇది ఎంతో బలాన్ని ఇస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. మెదడుకు ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
అవిసె గింజలు
అవిసె గింజలు రోజుకు ఒక గుప్పెడు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలు లేదా పిల్లలు అవిసె గింజలను తినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలతో పాటు లిగ్నన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. వీటిని అధికంగా తీసుకుంటే చర్మంపై ముడతలు కూడా మాయమైపోతాయి. అలాగే చర్మం మృదువుగా మారుతుంది. చర్మంలోని తేమ కూడా నిలిచి ఉంటుంది. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కాబట్టి ఒక చెంచా అవిసె గింజలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టండి. ఉదయం లేచాక వాటిని ఆ నీటిని తాగేయండి. లేదా స్మూతీలలో అవిసె గింజలను వేసుకొని తిన్నా మంచిదే. అవిసె గింజలని లడ్డూల రూపంలో కూడా తీసుకోవచ్చు.
రోజుకో అవకాడో
అవకాడో చర్మ ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. ఇది అద్భుతమైన సూపర్ ఫుడ్ గా చెప్పుకోవాలి. దీంట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, బ్లూటూత్ వంటి ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక అవకాడో పండు తింటే చాలు. చర్మం మృదువుగా మారిపోతుంది. అంతేకాదు యవ్వనం తొణికిసలాడేలా చేస్తుంది. చర్మం తేమను కాపాడి ఇది చర్మ కణాలను రిపేర్ చేసేందుకు సహాయపడుతోంది. కాబట్టి అవకాడో మీకు అన్ని విధాలుగా మేలే చేస్తుంది.
గ్రీన్ టీ
ముఖంపై వచ్చే ముడతలను కాంతి విహీనాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీ ఉదయాన్నే తాగండి. ఎందుకంటే దీనిలో ఉండే కాటేచిన్స్ అనే శక్తివంతమైన యాక్సిడెంట్లు చర్మంలో వృద్ధాప్య లక్షణాలను నెమ్మదించేలా చేస్తాయి. అలాగే చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. కాబట్టి మీకు నచ్చితే రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ కూడా తాగవచ్చు.