BigTV English

Miss World: మిస్ వరల్డ్ కిరీటం ఈసారి మిస్ ఇండియాదేనా..? నందినీ గుప్తా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Miss World: మిస్ వరల్డ్ కిరీటం ఈసారి మిస్ ఇండియాదేనా..? నందినీ గుప్తా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోతుంది. ఇండియాలో అందులోనూ హైదరాబాద్ లో జరుగుతున్న ఈ పోటీల్లో మిస్ ఇండియానే మిస్ వరల్డ్ గా ఎంపికైతే అంతకంటే కావాల్సిందేముంటుంది. కచ్చితంగా ఈసారి కిరీటం ఇండియాదేననే ధీమా అందరిలో ఉంది. అందులోనూ ఫైనలిస్టుల్లో మిస్ ఇండియా నందినీ గుప్తా అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ నందినీ గుప్తాయే, ఇక అధికారిక ప్రకటనే తరువాయి అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది. ఇంతకీ ఎవరీ నందినీ గుప్తా..? ఏంటి ఈమె స్పెషాలిటీ..?


59వ మిస్ ఇండియా టైటిల్ గెల్చుకుని మిస్ వరల్డ్ కి అర్హత సాధించిన నందినీ గుప్తా నేటివ్ ప్లేస్ రాజస్థాన్ లోని కోటా. 2003లో జన్మించిన నందిని స్కూలింగ్ అంతా కోటా లోనే జరిగింది. ముంబైలోని లాలా లజపతిరాయ్ కాలేజీ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న నందిని.. మోడలింగ్ రంగంలో ప్రవేశించింది. పదేళ్ల వయసునుంచే తనకు మిస్ వరల్డ్ కావాలనే కల ఉండేదని చెబుతుంది నందిని. బిజినెస్ రంగంలో ఆమెకు ఆసక్తి ఉంది, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలనే ఆశ ఉంది. నందినీ గుప్తా తండ్రి ఒక సాధారణ రైతు, తల్లి గృహిణి. ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆవాలు, మినుములు.. పండించే పొలాలతో తనకు అనుబంధం ఉందని.. పొలాల్లో సరదాగా బాల్యాన్ని గడిపానని గుర్తు చేసుకుంటారు నందిని.

మిస్ ఇండియా పోటీలు ఒక సాధారణ యువతిని అసాధారణంగా మారుస్తాయని చెబుతారు నందిని. తనను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తి రతన్ టాటా అని, మానవత్వం కోసం ఆయన ఏదైనా చేస్తారని, తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి కేటాయించారని చెబుతారు నందిని. ఇక బ్యూటీ ఇండస్ట్రీలో ఆమె రోల్ మోడల్ ప్రియాంక చోప్రా. ఆమె లాగా తన జీవితాన్ని కూడా స్ఫూర్తిమంతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నట్టు చెబుతారు నందినీ.


ఇక ప్రస్తుత మిస్ వరల్డ్ పోటీల్లో 108మంది అందగత్తెలు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ లో ఈరోజు ఫైనల్స్ జరగబోతున్నాయి. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా ఫైనలిస్ట్ కాగా, మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునే అవకాశాలు ఆమెకు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

1951నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలు మొదలైన 15 ఏళ్లకు, అంటే 1966లో భారత దేశం తరపు రీటా ఫారియా తొలిసారి మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. ఆ తర్వాత రెండో కిరీటం కోసం భారత్ 28 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 1994లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆమె సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కెరీర్ కొనసాగించారు. ఆ తర్వాత భారత్ లో కూడా ఈ పోటీలపై చర్చ బాగా పెరిగింది. ఐశ్వర్య రాయ్ తర్వాత 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లార్ మిస్ వరల్డ్‌ టైటిల్ ను గెలుచుకున్నారు. ఈ ఏడాది 72వ మిస్ వరల్డ్ టైటిల్ ని నందినీ గుప్తా గెలుచుకుంటే.. ఈ లిస్ట్ లో ఆమె లేటెస్ట్ ఎంట్రీ అవుతారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×