BigTV English

World Cancer Day 2025: క్యాన్సర్‌కు కారణం అవుతున్న స్మోకింగ్.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

World Cancer Day 2025: క్యాన్సర్‌కు కారణం అవుతున్న స్మోకింగ్.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

World Cancer Day 2025: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా, క్యాన్సర్ మన దేశంలో ఆరోగ్య సేవలకు పెద్ద సవాలుగా మారింది. ఇదిలా ఉంటే క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ 40% క్యాన్సర్ కేసులకు ఒక్క అలవాటు మాత్రమే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం అలవాటు ఉన్న వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.


ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షల మంది చనిపోతున్నారు. భారతదేశంలో కూడా, క్యాన్సర్ ముప్పు ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఈ వ్యాధి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తోంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిపుణులు భారతదేశంలో క్యాన్సర్ కేసులు 12% నుండి 18% పెరుగుతాయని అంచనా వేశారు. భారతదేశంలో క్యాన్సర్ కేసులు 2022లో 1.46 మిలియన్ల (14.6 లక్షలు) నుండి 2025 నాటికి 1.57 మిలియన్లకు (15.7 లక్షలు) పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.


ఈ తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని చిన్నప్పటి నుంచే నివారణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని చెడు రోజువారీ అలవాట్లు క్యాన్సర్‌కు అత్యంత కారణమని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసుల గురించి అవగాహన కల్పించడానికి , దాని నివారణ, గుర్తింపు , చికిత్సను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు .

మారుతున్న జీవనశైలితో పాటు, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ ఎక్కువగా వృద్ధులను, యంగ్ ఏజ్‌లో ఉన్న వారిని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న కాలుష్య ప్రమాదాలు ఈ వ్యాధి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి.

స్మోకింగ్‌తో క్యాన్సర్ ప్రమాదం:

ప్రజల్లో ఇప్పటికీ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఐదుగురు పురుషులలో ఒకరు , ఎనిమిది మంది మహిళల్లో ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

స్మోకింగ్ (ధూమపానం లేదా గుట్కా) భారతదేశంలో క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఇది దాదాపు 40 శాతం కేసులకు కారణం. మనం కేవలం పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే, దాదాపు 10 రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని చాలా తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్ ప్రమాదం , నివారణ:
పొగాకు ఏ రూపంలోనైనా తీసుకోవడం ప్రమాదకరం. పొగాకు మీ కణాలలో DNA దెబ్బతినడం ద్వారా క్యాన్సర్‌కు కారణమవుతుంది. దీని వలన కణాలు అసాధారణంగా పెరుగుతాయి . ఫలితంగా క్యాన్సర్‌గా మారుతాయి.

స్మోకింగ్ వల్ల వచ్చే (ధూమపానం) పొగలో 5,000 కంటే ఎక్కువ రసాయనాలు ఉంటాయి. వీటిలో కనీసం 70 క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఈ రసాయనాలు DNA ను దెబ్బతీస్తాయి. దెబ్బతిన్న DNA కణాలు అసాధారణంగా పెరగడానికి కారణమవుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

దేశంలో అధిక సంఖ్యలో యువత స్మోకింగ్ చేయడం కూడా ఆందోళన కలిగించే అంశమని, దీని వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ కారణంగా ఆరోగ్య రంగంపై అదనపు ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Also Read: ప్రతిరోజూ పాలు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు

ఊపిరితిత్తుల క్యాన్సర్  :
సాధారణంగా పొగాకు, ధూమపానం నోటి , ఊపిరితిత్తులలో క్యాన్సర్‌కు మాత్రమే కారణమని భావిస్తారు. ఈ అలవాటు శరీరంలోని ఇతర భాగాలలో కూడా క్యాన్సర్‌ను పెంచుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు, పొగాకు ఉత్పత్తుల వల్ల మహిళల్లో నోరు, గొంతు, మూత్రాశయం, కాలేయం-మూత్రపిండాలు, కడుపు, ప్యాంక్రియాస్, అలాగే గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇది మాత్రమే కాదు, మీరు స్మోకింగ్ చేయకపోయినా ఇతరులు స్మోకింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్నా కూడా క్యాన్సర్‌కు గురవుతారు. మనం ఈ ఒక్క అలవాటుకు దూరంగా ఉంటే, భవిష్యత్తులో అనేక రకాల క్యాన్సర్ల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Related News

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Weight Loss Tips: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్

Strawberries: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

Open Pores On Face: ఓపెన్ పోర్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?

Big Stories

×