IND VS PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించింది. ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుకు.. ఏ మాత్రం ఛాన్సు ఇవ్వలేదు టీమిండియా. దీంతో.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో కూడా టీమిండియా చేతిలో పాకిస్థాన్ చిత్తు అయింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read: IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి… బౌలింగ్ తీసుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్కెచ్ బాగా వర్కౌట్ అయింది. ఆ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి.. బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్… మొదట దూకుడుగా ఆడింది. కానీ ఆ తర్వాత.. చతికలపడింది. నిర్నీత 20 ఓవర్స్ లో 171 పరుగులు చేసి….5 వికెట్లు నష్టపోయింది. ఇక ఈ లక్ష్యాన్ని టీమిండియా అవలీలగా ఛేదించింది.
ఇక ఈ మ్యాచ్ లో గిల్ టచ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో 8 బౌండరీలు ఉన్నాయి. అటు అభిషేక్ శర్మ అయితే.. చుక్కలు చూపించాడు. 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. 6 బౌండరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య తమ పని ఫినిష్ చేశారు. దీంతో ఈ సూపర్ 4 మ్యాచ్ లో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరలో తిలక్ వర్మ బౌండరీ కొట్టి… జట్టును గెలిపించాడు. 18.5… ఓవర్ లలో నాలుగు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా… పాకిస్తాన్లో మరోసారి చిత్తు చేసింది.
టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో పెద్ద గొడవ జరిగింది. హరీస్ రఫ్ వర్సెస్ అభిషేక్ శర్మ ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ డిస్టర్బ్ చేసేందుకు హరీస్ రఫ్ ప్రయత్నం చేశాడు. దీంతో గొడవకు దిగాడు. అటు పంజాబ్ కు చెందిన అభిషేక్ శర్మ… రెచ్చిపోయాడు. హరీస్ రఫ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత… హరీస్ రఫ్ వర్సెస్ అభిషేక్ శర్మ ఇద్దరినీ అంపైర్ సముదాయించాడు. దీంతో.. గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటన వైరల్ గా మారింది.
Also Read:IND Vs PAK : నేడు పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్.. “నో షేక్ హ్యాండ్” తరువాత మరో సమరం
Bhag rauf bhag 😡 #indvspak #Harisrauf pic.twitter.com/N4jX0f9tLO
— Piyush Arora (@cric11forecast) September 21, 2025