Bigg Boss Telugu 9 Day 14: రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా మర్యాద మనీష్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. ఈ వారం నామినేషన్ లో సుమన్ శెట్టి, భరణి, డిమోన్ పవన్, ప్రియ, శ్రీజ, ఇమ్మాన్యుయేల్, ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్ లు ఉండగా.. వారిలో అతి తక్కువ ఓట్స్ రావడంతో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో రెండు వారాల్లోనే అతడు హౌజ్ ని వీడాల్సి వచ్చింది. మొదటి కామనర్స్ లో అందరిలో మనీష్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడి ఆట తీరు చూసి.. చివరిగా వరకు ఉంటాడని అనుకున్నాడు.
కానీ, పోను పోను అతడి ఆట తీరు తగ్గుతూ వచ్చింది. తన ఆట కంటే కంటెస్టెంట్స్ పైనే దృష్టి పెట్టాడు. ప్రతి చిన్న విషయానికి విసుక్కొవడం.. కో కంటెస్టెంట్స్ పై భగ్గమనడం చేశాడు. ఓనర్ అయ్యిండి.. ఓనర్స్ కి యాంటి గేమ ఆడాడు. అతడికి ఆటపై స్పష్టత రాలేదని అర్థమైంది. తన తీరుతో మనీష్.. బయట నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఫైనల్ ఆడియన్స్ అతడిని బయటకు పంపించారు. లీస్ట్ ఓటర్స్ లో ఫ్లోరా, మనీష్ ఉండగా.. అతి తక్కువ ఓటింగ్ పడిన మనీష్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. బయటకు వచ్చిన మనీష్.. తన ఎలిమినేషన్ ఇంకా నమ్మలేకపోతున్నా అన్నాడు.
నా బెస్ట్ ఇచ్చినా.. ఎందుకు బయటకు వచ్చానో అర్థం కావడం లేదని వాపోయాడు. ఇది ఆడియన్స్ జడ్జీమెంట్ అని, బిగ్ బాస్ చేతిలో లేదంటూ అతడిని ఓదర్చాడు హోస్ట్ నాగార్జున. ఇక బయటకు వచ్చిన కంటస్టెంట్స్.. హౌజ్ వారికి చివరికి బై చెప్పి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం అన్ని సీజన్ లో చూస్తూనే ఉన్నాము. ఇక మర్యాద మనీష్ కి కూడా నాగార్జున అదే చెప్పాడు. చివరికి హౌజ్ మేట్స్ బాయ్ చెబుతూ.. వారి తప్పుఒప్పులు చెప్పాలని ఇరికించాడు. తన ముందు బోర్డు పెట్టి టాప్ 3, బాటమ్ 3 ప్లేయర్స్ ఎవరో తన అభిప్రాయం చెప్పాలన్నాడు. ఎందుకో కూడా వివరించాలని చెప్పాడు. ఇక ముందుగా బాటమ్ ప్లేయర్ క్యాటరిగిరి ఎంచుకున్నాడు మనీష్. కామనర్స్ నుంచి శ్రీజ దమ్ము ఫోటో తిసి బాటమ్ ప్లేయర్ లో పెట్టాడు. ః
అగ్నీ పరీక్షలో ఏదైతే తన బలం అనుకుందో.. దాన్ని హౌజ్ లో బలహీనతగా మార్చుకుంటుందని, తన ఆట తీరు మార్చుకోవాలని సూచించాడు. అగ్నీ పరీక్షలో చూసిన శ్రీజ.. హౌజ్ కనిపించడం లేదు.. అందుకే తన ఆట నాకు వరస్ట్ అనిపించింది అని.. శ్రీజ దమ్మును వరస్ట్ ప్లేయర్ జాబితాలో చేర్చాడు. అలా ఫ్లోరా, శ్రీజ దమ్ము, సునీల్ శెట్టిలను బాటమ్ 3 ప్లేయర్ జాబితాలో చేర్చాడు. ఆ తర్వాత భరణి ఆట తనకు బాగా నచ్చిందని, అందరిని కలుపుకుపోతూ.. ఎవరినీ నొప్పించకుండ.. ఎక్కడ ఎలా దమ్ము వాడాలో అలా వాడుతూ.. చాలా పద్దతిగా ఆడుతున్నాడని పొగిడాడు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్, సంజన, ఇమ్మాన్యుయేల్ లను టాప్ చూడాలనుకుంటున్నానని చెప్పాడు.
ఇక హౌజ్ లో ఎవరినైనా మిస్ అవుతాను అంటే.. అది సంజన గారినే అని.. మొదట్లో తనని తిట్టుకున్నా.. తను కెప్టెన్ అయ్యాక పిలిచి పని చెప్పిందంటూ ఎమోషనల్ అయ్యాడు. సంజన కూడా మనీష్ చూసి కన్నీరు పెట్టుకుంది. వెళుతూ వెళుతూ సంజన బిగ్గెస్ట్ సీక్రెట్ రివీల్ చేశాడు. తను రోజంత అందరిని సతాయించినా.. రాత్రి ఒంటరిగా కూర్చోని ఏడుస్తుందంటూ అసలు విషయం బయటపెట్టాడు. ఈ విషయం హౌజ్ లో ఎవరికి తెలియదని, ఓ రోజు రాత్రి తాను మాత్రమే చూశానన్నాడు. అప్పుడే సంజన గారి మంచి మనసు అర్థమైందంటూ మనీష్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక చివరిలో బిగ్ బాంబ్ ఎవరికి వేస్తావని హోస్ట్ నాగ్ అడగ్గా.. తాను ప్రియకు ఇస్తానన్నాడు. తను వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, హౌజ్ లో నాకు ఇష్టమైన వ్యక్తి, నచ్చని వ్యక్తి తానే అని చెప్పాడు. మనీష బిగ్ బాంబ్ వేడయంతో..ఈ వారం వాష్ రూమ్స్ క్లినింగ్ బాధ్యత ప్రియకు వచ్చింది.