Pawan Kalyan: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఓజీ(OG). సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్లి రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది.. ఇక ఈ సినిమా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు చిత్ర బృందం ఓజీ కన్సర్ట్ పేరిట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అయితే వర్షం కారణంగా ఈ వేడుక చాలా హడావిడిగా ముగిసింది. అయితే వర్షం పడుతున్న అభిమానులు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఇక అభిమానులను ఉత్సాహపరుస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు స్టార్ పవన్ కళ్యాణ్ కాదని, ఈ సినిమాకు ఇద్దరే స్టార్స్ ఒకరు సుజీత్, మరొకరు తమన్ అంటూ ఇద్దరిపై ప్రశంసలు కురిపించారు. తమన్ అండ్ టీం ఎంతో అద్భుతంగా వర్క్ చేశారని సినిమా చాలా మంచిగా వచ్చిందని వెల్లడించారు.
రాజకీయాలలోకి వచ్చేవాన్ని కాదు..
తాను డైరెక్షన్ చేస్తున్న సమయంలో ఇలాంటి టీం కనుక నాకు దొరికి ఉంటే బహుశా నేను రాజకీయాలలోకి వచ్చేవాన్ని కాదేమో అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సుజిత్ ఎంతో విజన్ ఉన్న డైరెక్టర్ అని,త్రివిక్రమ్ సుజిత్ ను నాకు పరిచయం చేశారని తెలిపారు. ఇలా డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. తాను రాజకీయాలలోకి వెళ్లినా అభిమానులు మాత్రం నన్ను వదలలేదు అంటూ పవన్ తెలియజేశారు.
నా ఆలోచన మొత్తం సినిమాల గురించే…
ఇప్పుడు కూడా తాను సినిమాలు, రాజకీయాలు అంటూ జనాలతో పోరాటం చేస్తున్నాను అంటే మీరు ఇస్తున్న ధైర్యమే కారణమని పవన్ వెల్లడించారు. తాను సినిమాలు చేస్తున్నప్పుడు ఈ ఒక్క ఆలోచన తనని ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు.. తాను ఒక సినీ నటుడిని.. సినిమా చేస్తున్నంతసేపు సినిమాల గురించే నా ధ్యాస ఉంటుంది తప్ప మిగతా వాటి గురించి ఆలోచన రాదని తెలిపారు. అలాగే రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్నప్పుడు కేవలం రాజకీయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని తెలిపారు. సుజిత్ నాకు జపాన్ భాషను కూడా నేర్పించారు. ఇలాంటి టీం ముందే దొరికి ఉంటే కచ్చితంగా సినిమాలలోనే కొనసాగే వాడినని పవన్ తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో నటి శ్రేయ రెడ్డి గురించి కూడా మాట్లాడుతూ లేడీ శివంగి అంటూ ఆమెపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read: OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!