Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత ‘బ్రో’ అనే సినిమాలో తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేసి కాస్త డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఆ తరువాత ‘విరూపాక్షా’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. సినిమా విజయం అయింది కానీ ఇందులో ఆయన పర్ఫామెన్స్ కాస్త తగ్గిందని, డాన్స్ విషయంలో కాస్త వెనుకబడ్డారు అని కొంతమంది విమర్శలు గుప్పించారు. దీంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీకి దూరమైనా.. తన మేనమామల దారిలోనే ఇతరులకు సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆరు రోజుల క్రితం కూడా ఒక వ్యక్తి చికిత్సకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు సాయిధరమ్ తేజ్.
వీరు పోట్ల డైరెక్టర్ తో సాయిధరమ్ తేజ్ కొత్త మూవీ..
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష 2’ సినిమాతోపాటు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా అంతలోనే మరో సినిమాకి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా సాయిధరమ్ తేజ్ బిందాస్(Bindaas ) మూవీ డైరెక్టర్ వీరు పోట్ల (Veeru potla) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏ.కే.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
సాయిధరంతేజ్ కెరియర్..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడిగా, సినీ రంగంలోకి అడుగుపెట్టారు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ‘పిల్ల నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్.జే.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న సాయి ధరమ్ తేజ్.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విన్నర్, జవాన్, తేజ్ ఐ లవ్ యు వంటి పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తర్వాత సోలో బ్రతికే సో బెటర్ సినిమా తర్వాత ఆక్సిడెంట్ కి గురైన ఈయన.. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి కోమాలోకి కూడా వెళ్లిపోయారు. ఇక భగవంతుడి ఆశీస్సులు, కుటుంబ సభ్యులు,అభిమానుల ప్రార్థనలతో తిరిగి ఆరోగ్యవంతుడిగా మారారు సాయిధరమ్ తేజ్. ఇక యాక్సిడెంట్ కి గురికాక ముందు ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమాను 2021లో ఆక్సిడెంట్ తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయింది. ఇక 2023లో యాక్సిడెంట్ నుంచి కోలుకొని విరూపాక్ష సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ తనను తాను మార్చుకున్న సాయి ధరంతేజ్ ఇటీవల తన పేరును సాయి దుర్గ తేజ్ గా కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన తల్లి దుర్గ పేరు మీదుగా తన పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. ఇప్పుడు నటించబోయే సినిమాలతో భారీ సక్సెస్ అందుకోవాలని సాయి ధరమ్ తేజ్ అభిమానులు కోరుకుంటున్నారు.