OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు, ఎలాంటి జానర్ లో వచ్చినా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కామెడీ జనర్ లో కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ కథ ఉత్తర కేరళలోని ఒక గ్రామంలో జరుగుతుంది. అది కూడా ఒక ప్రేమ కథ చుట్టూ ఈ కామెడీ అల్లుకుంటుంది. ఇది ఒక మైండ్ రీఫ్రెష్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Journey of Love 18+’ అనేది 2023లో విడుదలైన మలయాళం కామెడీ డ్రామా చిత్రం. ఇది అరుణ్ డి. జోస్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో నస్లెన్ కె. గఫూర్ (అఖిల్), మీనాక్షి దినేష్ (అతిర), మాథ్యూ థామస్ (రెంజు) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల నిడివి ఉన్న ఈసినిమా IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2023 జూలై 7న థియేటర్లలో విడుదలై, 2023 సెప్టెంబర్ 5 నుండి SonyLIV, Airtel Xstream Play, Watchoలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది ఉత్తర కేరళలోని ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ. ఇక్కడ ఆకాష్ ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు. లెఫ్ట్-వింగ్ పార్టీలో కార్యకర్త గా ఉంటాడు. పార్టీ సెక్రటరీ రవీంద్రన్ కుమార్తె అతిరాతో ఆకాష్ ప్రేమలో పడతాడు. అతిరా తండ్రి రవీంద్రన్ రాజకీయ ప్రతిష్ట, కులాలు కూడా వేరు కావడంతో వీళ్ళ సంబంధానికి అడ్డంకులు వస్తాయి. అయితే ఆకాష్, అతిరా ప్రేమ బలంగా ఉంటుంది. ఇక ఈ జంట లవ్‌లో ఉండటంతో, కుల బేధాలు, ఫ్యామిలీ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుంచి పారిపోతారు. ఈ జర్నీలో వాళ్ల ఫ్రెండ్స్ రెంజు, పట్టర్, డ్రైవర్ రాజేష్ సహాయం చేస్తారు. కామెడీ, ఎమోషన్స్, చిన్న చిన్న ట్విస్ట్‌లతో వీళ్ల ప్రయాణం సాగుతుంది.
ఈ రోడ్ ట్రిప్‌లో వీళ్ళకు, రవీంద్రన్ అనుచరుల నుండి ఛేజింగ్ సన్నివేశాలు ఎదురు పడతాయి. ఈ కథ ముందుకు సాగుతున్నప్పుడు, ఆకాష్, అతిరా రోడ్ ట్రిప్ వారి ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది. కానీ అదే సమయంలో వారి కుటుంబాల నుండి వచ్చే ఒత్తిడి ఈ జంట నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. రవీంద్రన్ రాజకీయ ప్రతిష్ట, అతని కుమార్తె పట్ల అతనికి ఉన్నప్రేమ కథకు డ్రామాటిక్ టెన్షన్‌ను తీసుకొస్తాయి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఉహించని, ఒక ఎమోషనల్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఒక కోర్ట్ సీన్‌లో అతిర నిర్ణయం ఏంటనేది సినిమాకి హైలైట్ అవుతుంది. చివరికి అతిర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఆకాష్, అతిరల ప్రేమ గెలుస్తుందా ? కుటుంబ ఒత్తిడిలో నలిగిపోతుందా ? అనే విషయాలను, ఈ మలయాళం కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్