OG Concert: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సుజిత్ (Sujeeth)దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ఓజీ(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఎల్బీ స్టేడియంలో ఈ సినిమా కన్సర్ట్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది అభిమానులు ఎల్బీ స్టేడియం చేరుకున్నారు. అయితే అకాల వర్షం కారణంగా అభిమానులు ఒకింత నిరాశకు గురి అయ్యారు. ఇలా వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు వర్షంలోనే తడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇలా వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా వారిలో ఫుల్ జోష్ నింపుతూ తన స్పీచ్ తో అదరగొట్టారు. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని వేదికపైకి ఎంట్రీ ఇవ్వడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు. జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంది సంజయ్ సాహుకి ఏది ఊరికే రాదు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కి కూడా ఏది ఊరకనే రాదని ఎన్నో కష్టాలు దాటుకొని ఈనెల 25వ తేదీ ఓజీ సినిమా ద్వారా రాబోతున్నామని తెలిపారు.
వర్షం మనల్ని ఆపుతుందా?
ఇక ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం వర్షంలో తడుస్తూనే ర్యాంప్ వాక్ చేస్తూ అభిమానులను సందడి చేశారు. అదేవిధంగా ఈ వర్షం మనల్ని ఆపుతుందా.. ఈ వర్షం ఆపుతుందా? మనల్ని ఇప్పటి వరకు ఏది ఆపిందని? ఒక ఓటమి ఆపలేదు, పరాజయాలు మనల్ని ఆపాయా? ఈ వర్షం కూడా మనల్ని ఆపలేదు అంటూ అభిమానులలో జోష్ నింపుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇక వేదికపై పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని రావడంతో ఈ కత్తి గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక మోహన్ పై ప్రశంసలు…
డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కత్తి పట్టుకుని వస్తారా.. సినిమా కోసం కాబట్టి సరిపోయింది అంటూ తాను కత్తి పట్టుకొని ఎంట్రీ ఇవ్వడం గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.. ఇక ఓజి సినిమా గురించి కూడా ఈయన ఎన్నో విషయాలను మాట్లాడుతూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఇక సువ్వి సువ్వి పాట గురించి కూడా మాట్లాడుతూ హీరోయిన్ ప్రియాంక ఆరుళ్మోహన్ (Priyanka Arul Mohan)పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రోజు సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ముందు రోజే ప్రీమియర్స్ ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఏర్పడిన బజ్ చూస్తుంటే మాత్రం ఈసారి పవన్ సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నారని తెలుస్తుంది.
Also Read: OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలిసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!