Bigg Boss Telugu 9 Day 13 Episode: ఆదివారం ఎపిసోడ్ ఆటపాటతో ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా ఎలిమినేషన్ రౌండ్ ఉత్కంఠ పెంచింది. ముఖ్యంగా హౌజ్ మేట్స్ కి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఎవరూ అనుకోని వ్యక్తి బయటకు రావడంతో కంటెస్టెంట్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక ఎంట్రీతోనే నాగార్జున ఇంటి దొంగలను పట్టించాడు. నిన్నటి ఎపిసోడ్ లో మిస్సయిన థమ్సప్స్ ని దొరికించిన నాగార్జున.. అవి దొంగలించింది ఎవరనేది మాత్రం చెప్పకుండ ఓనర్స్ ని సస్పెన్స్ లో ఉంచాడు. దీంతో అవి ఎవరూ తీశారా? అనేది హౌజ్ మేట్స్ కి ప్రశ్నగా మిగిలింది.
అయితే ఈ రోజు థమ్సప్ దొంగలను పట్టించాడు. వీడియో తో సహా వారి బండారం బయటపెట్టాడు. సంజన, ఫ్లోరా ఇద్దరు కలిసి థమ్సప్ దొంగతనం చేసినట్టు బట్టబయలైంది. అయితే ఈ కారణాన్ని చూపించి నామినేషన్ చెయొద్దని హెచ్చరించారు. ఇక వచ్చిరాగానే తనూజని నాగ్ ఆటపట్టించారు. ఆమె చేత తన సీక్రెట్ రిలేషన్ బయటపెట్టించారు. ఇవి ప్రొమోలో సైతం చూశాం. ఆ తర్వాత నాగ్ అధ్వర్యంలోనే కెప్టెన్సీ టాస్క్ జరిగింది. నిన్న డిమోన్ పవన్ కెప్టెన్సీని అన్ ఫెయిర్ డెసిజన్ గా ప్రూవ్ చేయడంతో అది రద్దయిన సంగతి తెలిసిందే. డిమోన్ స్వయంగా దీన్ని తిరస్కరించాడు. దీంతో కెప్టెన్సీ రద్దయ్యింది.
ఈ రోజు మళ్లీ అదే కంటెండర్స్(భరణి, డిమోన్ పవన్, మర్యాద మనీష్, ఇమ్మాన్యుయేల్) మధ్య మళ్లీ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. వారి టయిర్ల టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో మూడు స్క్వేర్ బాక్స్ లు పెట్టి అందులో కంటెస్టెంట్స్ టియర్లు పెట్టాలి. నలుగురిలో ముడూ బాక్సులను మాత్రమే పెట్టారు. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరి టయిర్ బాక్సాలో ఉండదో వారిద్దరు ఎలిమినేట్. మొదటి రౌండ్ భరణికి బాక్స్ దొరకపోవడంతో అతడు మనీష్ ని టార్గెట్ చేశాడు. మనీష్ తప్పించి తన టయిర్ పెట్టడానికి శతవిధాల ప్రయత్నించాడు. భరణిని సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ.. మనీష్ కూడా ఒటమిపాలయ్యాడు.
బజర్ మొగిన టైంలో ఇద్దరు టయర్లు బయటే ఉండటంతో ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక సెకండ రౌండ్ డిమోన్ వర్సెస్ ఇమ్మాన్యుయేల్ అన్నట్టు పోటీ జరిగింది. కానీ, చివరిలో అందరి కంటే మెరుగైన ఆట కనబరిచి.. మళ్లీ కెప్టెన్సీని దక్కించుకున్నాడు డిమోన్. గెలిచింది డిమోన్ అయినా.. నాగ్ మాత్రం ఇమ్మూని పొగిడాడు. వెల్ ప్లెయిడ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఆ తర్వాత కెప్టెన్సీ దక్కించుకున్న డిమోన్.. ఇది దమ్మున్న ఆట అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని కొనియాడాడు. ఇక హౌజ్ లో మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరంటే.. హౌజ్ మొత్తం ఫ్లోరా షైనీని ఎంపిక చేసింది.
Also Read: Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో.. ఓజీతో సాధ్యమయ్యేనా?
తనకు ఇచ్చిన పని తను చేసుకుంటూపోతుంది.. కానీ, గేమ్ పై ఫోకస్ పట్టడం లేదని కంప్లైయింట్ ఇచ్చారు. హౌజ్ లో తను ఎవరితో కలవడం లేదని, అలాగే భాష వల్ల ఆమెతో కలవలేకపోతున్నామంటూ ఎవరికి కారణాలు వారు చెప్పారు. హౌజ్ మొత్తం కలిసి ఫ్లోరాను బోరింగ్ పర్సన్ గా ఓటు వేయడంతో ఆమె జైలుకు వెళ్లాలని హోస్ట్ నాగార్జున ఆదేశించారు. ఇకనైనా జాగ్రత్త పడి ఆట మెరుగుపరుచుకోవాలని ఫ్లోరాకి సూచించారు. ఇక చివరిగా ఎలిమినేషన్ చివరిగా లిస్ట్ ఓటర్స్.. ఫ్లోరా, మర్యాద మనీష్ ఉన్నారు. వారిద్దరి యాక్టివిటీ రూం పిలిచి.. తక్కువ ఓట్స్ వచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేశారు. వీరిద్దరి లీస్ట్ ఓట్స్ కామనర్ మనీష్ రావడంతో అతడు హౌజ్ ని వీడాడు.