IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ సంచలన సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేయగానే పహల్గామ్ లో అమాయక పర్యాటకులను అతని సోదరులు.. ఎలా చంపారో బ్యాట్ ని గన్ లా పట్టి చూపించాడు. దీంతో టీమిండియా అభిమానులు పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశంతో క్రికెట్ మ్యాచ్ ని అనుమతించి.. వారికి వేదిక ఇచ్చినందుకు బీసీసీఐ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్
ఫర్హాన్ క్యాచ్ 2 సార్లు మిస్..
ఇటీవల పహల్గామ్ దాడి కారణంగా బాధితులు, కొంత మంది అభిమానులు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడవద్దని చెప్పినప్పటికీ బీసీసీఐ మాత్రం ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఆడుతోంది. తొలి మ్యాచ్ లో “షేక్ హ్యాండ్” ఇవ్వలేదు. దీంతో పాకిస్తాన్ రాద్దాంతం చేసింది. ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో కూడా టాస్ వేసే సమయంలో సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అయితే ఓపెనర్ పర్హాన్ క్యాచ్ ని తొలుత అభిషేక్ శర్మ మిస్ చేశాడు. మరోసారి కుల్దీప్ యాదవ్ మిస్ చేశాడు. వీరిద్దరి చేతిలో ఔట్ ని తప్పించుకొని 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు ఫర్హాన్. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కి దిగింది పాకిస్తాన్ జట్టు. అయితే టీమిండియా ఇవాళ ఫీల్డింగ్ లో విఫలం చెందిందనే చెప్పాలి. ముఖ్యంగా బుమ్రా వంటి బౌలింగ్ లో సిక్స్ లు కొట్టారు పాకిస్తాన్ బ్యాటర్లు. మరోవైపు పాకిస్తాన్ తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ ప్రదర్శన చాలా పేలవంగా సాగుతోంది. మన ఫీల్డర్లు 3 క్యాచ్ లను జారవిడిచారు. పాక్ ఓపెనర్ ఫర్హాన్ 2 క్యాచ్ లను అభిషేక్, కుల్దీప్ యాదవ్ వదిలేశారు. దీంతో అతను 34 బంతుల్లోనే హాప్ సెంచరీ చేసి.. టీమిండియాను అవమానపరిచాడు. . నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 171 పరుగులు చేసింది.
Also Read : IND Vs PAK : టీమిండియాతో మ్యాచ్..సైకాలజిస్ట్ ను రంగంలోకి దించుతోన్న పాక్
టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్ఘాన్ రెండు క్యాచ్ లు డ్రాప్ చేశారు. దీంతో అతను సద్వినియోగం చేసుకొని 58 రన్స్ చేశాడు. ఇక పాకిస్తాన్ బ్యాటర్లలో అయూబ్ 21, నవాజ్ 21 రన్స్ చేశారు. ఇక భారత బౌలర్లలో శివమ్ దూబే 2, హర్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. 172 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.