SSMB 29 : దర్శక దిగ్గజం జక్కన్న (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యాన్ వరల్డ్ మూవీ ‘ఎస్ఎస్ఎంబీ 29’ (SSMB 29). ఈ మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా, సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అలాగే సెట్స్ నుంచి ఎలాంటి లీక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఇప్పటిదాకా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ అని మురిసిపోతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా అసలు హీరోయిన్ కాదనేది ఆ న్యూస్ సారాంశం.
ప్రియాంక చోప్రా లీడింగ్ లేడీ కాదా?
కొన్ని రోజుల క్రితం ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగు పెట్టడంతో అందరూ ఆమె ‘ఎస్ఎస్ఎంబీ 29’ మూవీ కోసమే ఇక్కడికి వచ్చిందని అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ఈ సినిమాలో హీరోయిన్ కాదు అనే టాక్ కూడా నడిచింది. ఇలా ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే, ప్రియాంక చోప్రా ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమాకు సంబంధించిన టెస్టు లుక్ పూర్తి చేయడం, షూటింగ్లో పాల్గొనడం కూడా జరిగిపోయాయి. రాజమౌళి, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణితో ప్రియాంక చోప్రా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఇంకేముంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబల్ బ్యూటీ రొమాన్స్ అంటే ఎలా ఉంటుందో అంటూ ఊహల్లో తేలిపోవడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన సపోర్టింగ్ రోల్ చేస్తుందని అంటున్నారు. ఇందులో మహేష్ బాబుతో కలిసే ఆమె నటిస్తున్నప్పటికీ ఆమె ఈ సినిమాలో అసలైన హీరోయిన్ కాదు అనేది తాజా వార్తలు సమాచారం. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు మరి ? అనే విషయం మరోసారి చర్చకు దారి తీసింది.
పైలట్ మోడ్ లో షూటింగ్
ఇక ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా గురించి బయటకు వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే ప్రస్తుతం షూటింగ్ పైలట్ మోడ్ లో జరుగుతోంది. అంటే ఇప్పుడు షూటింగ్ చేస్తున్న ఫుటేజ్ ఫైనల్ ఎడిట్ లో భాగమవుతుందా లేదా ? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేకుండానే సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ జరుగుతున్నారట జక్కన్న. ఈ వార్తల్లో ఎంత వరకు నిజము ఉందనేది తెలియదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి ఈ రూమర్లు. ఏదేమైనా జక్కన్న ఇప్పటికే నటీనటులందరి దగ్గర బల్క్ డేట్స్ తీసుకునే ఉంటారు. కాబట్టి అనుకున్న విధంగా మూవీని చెక్కే వరకు ఆయన వదలరు. మూవీ రిజల్ట్ కూడా అంతే పక్కాగా ఉంటుందనుకోండి.
ఇదిలా ఉండగా జక్కన్న ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘ఎస్ఎస్ఎంబీ 29’ షూటింగ్ మొదలు పెట్టగా, ఫిబ్రవరి 3 తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవుతుందని అంటున్నారు. అలాగే సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి చివరలో స్టార్ట్ చేయబోతున్నారని చెబుతున్నారు.