Rohith Sharma : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఎవ్వరూ ఎలా వ్యవహరిస్తారో చెప్పడం కష్టం అనే చెప్పాలి. కొంత మంది ఆటగాళ్లు ఎప్పుడూ రిటైర్డ్ అవుతారో.. మరోవైపు రిటైర్ అయ్యాక కోచ్ లుగా మారడం.. లేదంటే కీలక పదవులు చేపట్టడం చేస్తున్నారు. ఎవ్వరూ ఎప్పుడూ ఏ పదవీ అధిరోహిస్తున్నారో చెప్పడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం అనే చెప్పాలి. తాజాగా టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించి అండర్ 19 జట్టుకి కోచ్ గా వ్యవహరించనున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రోహిత్ శర్మ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..? అంటూ ఆశ్చర్యపోవడం విశేషం.
Also Read : IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్
వాస్తవానికి టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభం ఆఫ్ స్పిన్నర్ బౌలర్. కానీ మధ్యలో బ్యాటర్ గా మారాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలా ఎందుకు మారాడంటే..? తన చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ అలా మారడంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ పేరిట ఐపీఎల్ లో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఐపీఎల్ 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన రోహిత్.. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించడం విశేషం. మరోవైపు 2009లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక మరో వైపు టీమిండియా టీ-20 ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియాలోకి రావడానికి కూడా రోహిత్ శర్మనే కారణం అని తెలుస్తోంది.
ముఖ్యంగా రోహిత్ శర్మ టీ 20ల మ్యాచ్ లకు రిటైర్ మెంట్ ప్రకటించిన తరువాత.. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ టీమిండియాలోకి అడుగుపెట్టాడు. మరోవైపు టీ 20 లో రోహిత్ శర్మ మాదిరిగానే అభిషేక్ శర్మ కూడా దూకుడుగానే ఆడుతాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ బిజీ క్రికెట్ సీజన్ కోసం తమ సన్నహాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కఠోరంగా సాధన చేస్తూ చెమటొడుస్తున్నాడు. త్వరలో జరుగనున్న కీలక సిరీస్ లే లక్ష్యంగా రోహిత్ పదును పెడుతున్నాడు. రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడనున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నాడని ఓ వార్త హల్ చల్ చేయడం విశేషం. వాస్తవానికి రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నాడనే ప్రచారం కేవలం రూమర్ మాత్రమే. వాస్తవానికి అండర్ 19 ఆటగాళ్లను కలిసి వాళ్లతో మాట్లాడాడు. తన ఎక్స్ పీరియన్స్ ని అండర్ 19 ఆటగాళ్లతో పంచుకున్నాడు. వాళ్లకు ఓ క్లాస్ తీసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో రోహిత్ శర్మ పై ఇలా రూమర్స్ క్రియేట్ అవుతున్నట్టు సమాచారం.