BigTV English

Yoga For Eye Sight: ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు

Yoga For Eye Sight: ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు

Yoga For Eye Sight: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో స్క్రీన్‌ను నిరంతరం చూడటం వల్ల చాలా మంది చూపు కంటి చూపు సమస్యలను ఎదుర్కుంటున్నారు. అలాంటి వారు కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా ఎంతటి ఐ సైట్ అయిన తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మరి కంటి చూపును పెంచే యోగాససనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


కంటి చూపును మెరుగుపరచడానికి మీరు ట్రాటక్ యోగాసనాన్ని చేయవచ్చు. అయితే దీనిని చేయడానికి సరైన పద్ధతి, అందుకు సంబంధించిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా కూడా చాలా ముఖ్యం.

కంటి చూపు కోసం యోగా:


కంటి చూపు కోసం యోగా: నేటి మొబైల్‌, ల్యాప్‌టాప్‌ల యుగంలో, మన కళ్ళు రోజుకు చాలా గంటలు స్క్రీన్‌పై బిజీగా ఉంటాయి. కానీ నేడు దాదాపు చిన్న వయస్సు నుంచి పెద్ద వారి వరకు ప్రతిరోజు సగటున 6-7 గంటలు స్క్రీన్‌ చూస్తున్నారు. ఈ కారణంగానే నేడు భారతదేశంలో చాలా మంది ప్రజలు కళ్లద్దాలు ధరించడం లేదా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్నిసార్లు కంటి చుక్కలతో పాటు కొన్ని రకాల యోగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 10 నిమిషాల పాటు త్రాటక్ యోగాసనాన్ని చేస్తే, అస్పష్టమైన దృష్టి సమస్య కూడా తొలగిపోతుంది. ఈ సాధన రెగ్యులర్ గా చేస్తే కళ్ల అద్దాలను కూడా తొలగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ యోగాను క్రమం తప్పకుండా చేయండి.

మీ కళ్ళు నిరంతరం అస్పష్టమైన దృష్టిని కలిగి ఉంటే లేదా అవి కొంత సమయం తర్వాత అస్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తే కనక క్రమంగా మీ దృష్టి మసకబారడం ప్రారంభిస్తుంది. అప్పుడు త్రాటక్ ఆసనం లేదా వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

Also Read: మతిమరుపు ఎలా మొదలవుతుంది ? ఎప్పుడు జాగ్రత్త పడాలి

త్రాటక్ యోగా యొక్క ప్రయోజనాలు:
త్రాటక్ యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల కంటి నైపుణ్యాలు పెరుగుతాయి . మనస్సు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కంటి చూపు స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల అనేక కంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

ఉదాహరణకు, మెదడు యొక్క సిరలు మూసివేయబడితే అవి తెరుచుకుంటాయి. ఇది కంటి కండరాలను మెరుగుపరుస్తుంది మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. దీని వల్ల తలనొప్పి, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. సంకల్ప శక్తిని కూడా పెంచుతుంది. అంతే కాకుండా సహనాన్ని బలపరుస్తుంది. అందుచేత త్రాటక్ యోగం చాలా ప్రయోజనకరం.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×