E-Paper
Advertisement

ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. ఐదుగురు మృతి, పలు జిల్లాల్లో భారీ నష్టం!

ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. ఐదుగురు మృతి, పలు జిల్లాల్లో భారీ నష్టం!
Advertisement

Arnab Cyclone: రాష్ట్రంలో ‘అర్నాబ్’ తుఫాను సృష్టించిన బీభత్సం సామాన్య ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఈదురుగాలులు, వర్షాల ధాటికి తీరప్రాంత జిల్లాలు ఉలిక్కిపడ్డాయి. ఊహించని రీతిలో విరుచుకుపడిన ఈ ప్రకృతి విపత్తు దాటికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దారుణంగా ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని నింపింది.

జిల్లాల్లో అర్నాబ్ బీభత్సం..

Advertisement

కోస్తాంధ్ర వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తుఫాను ధాటికి వీచిన గాలులకు చర్చి వద్ద పెద్ద చెట్టు విరిగిపడి కిషోర్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే బొండాడవారి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న రాంబాబు (34)పై ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగిపడటంతో తీవ్ర గాయాలై మృతిచెందారు. గాలి తీవ్రతకు పలుచోట్ల దుకాణాల బోర్డులు లేచిపోగా, కొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి.

కోనసీమ, విశాఖల్లో విషాద ఛాయలు

Advertisement

మరోవైపు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సఖినేటిపల్లి మండలం ప్రకాష్‌పురంలో వర్షాల ధాటికి గుడిసె కూలిపోవడంతో లోపల ఉన్న కొల్లు వెంకాయమ్మ అనే వృద్ధురాలు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు విడిచారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తెగిపడ్డ కరెంట్ వైర్లు యమపాశాలయ్యాయి. విశాఖలోని బాలాజీనగర్‌లో విద్యుత్ స్తంభం పడి మాధవి అనే మహిళ మృతిచెందగా, నీటిలో తెగిపడిన కరెంట్ వైర్లను గమనించక దేవుడు (65) అనే వ్యక్తి షాక్‌కు గురై మరణించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలోనూ ఇదే రీతిలో విద్యుత్ వైరు తగిలి భాగ్యలక్ష్మి (55) అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు.

అధికారుల హెచ్చరిక

ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా తెగిపడిన విద్యుత్ వైర్లు, పాతబడిన చెట్ల కింద నిలబడ వద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Also Read: కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు? వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Tags

Related News

పవన్ కళ్యాణ్‌కు మాజీ డిప్యూటీ సీఎం బిగ్ షాక్.. మహిళల దాడులపై సంచలన సవాల్!

అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ.. అర్నబ్ తుఫాను నష్టంపై కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి

అర్నబ్ తుఫాను దెబ్బకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వెనక్కి వెళ్లే ఛాన్స్, ఎస్ఈసీ నిర్ణయంపై పార్టీల చూపు!

అర్ణబ్ తుఫాన్ బీభత్సం.. ఏలూరు, తీరప్రాంతాలు జలదిగ్బంధం

ఓ వైపు తుఫాను.. మరోవైపు పండగల వేళ, నిత్యావసర వస్తువులపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా

ఏపీని వణికించిన అర్నబ్ తుఫాన్.. కుమ్మేస్తున్న భారీ వర్షాలు, విద్యుత్ లేక వివిధ ప్రాంతాల్లో అల్లాడుతున్న ప్రజలు

Big Stories

Advertisement
×