E-Paper
Advertisement

Telangana Politics: పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం.. రంగంలోకి జనసేన, బర్తరఫ్ చేస్తే బెటర్

Telangana Politics: పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం.. రంగంలోకి జనసేన,  బర్తరఫ్ చేస్తే బెటర్
Advertisement

Telangana Politics: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ అధికార కాంగ్రెస్ నేతలు ఏకేయడంతో జనసేన పార్టీ ఆత్మరక్షణలో పడింది. మంగళవారం రోజంతా ఇటు తెలంగాణ అటు ఏపీ వ్యాప్తంగా చర్చ జరిగింది. చివరకు సాయంత్రానికి జనసేన పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.

పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం, రంగంలోకి జనసేన

Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. దీనిపై మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం దృష్ట్యా ఆ మాటలను వక్రీకరించవద్దని అందులో పేర్కొంది. జనసేన నుంచి రియాక్షన్ రావడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మరోమారు అన్నారు. ఆయన వ్యాఖ్యలు చేసిన 10 రోజులు తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పవన్ సినిమాలు ఆడవని అంటున్నారని, మీరు చూడొద్దు అంటే వాళ్ల అభిమానులు ఆగుతారా? అంటూ ప్రశ్నించారు.

Advertisement

ప్రకటన విడుదల చేసిన జనసేన

పవన్ కళ్యాణ్‌ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ నారాయణ. ఆయన వ్యాఖ్యల వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు భౌగోళికంగా విడిపోయారు తప్పం మరొకటి లేదన్నారు. నాడు పవన్ చేగువేరా డ్రెస్ వేసుకొని తిరిగారని, ఇప్పుడు సావర్కర్ శిష్యుడి అవతారం ఎత్తారని అన్నారు.

సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టే అలాంటి భాష వస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని స్వేచ్ఛగా గుళ్ళు, గోపురాలు తిరగాలని, ఆయన రాజాకీయ నాయకుడిగా పనికి రాడన్నారు. తక్షణమే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని బర్తరఫ్ చేయాలన్నారు.

ALSO READ:  పంచాయతీ ఎన్నికలు.. ప్రత్యర్థులు వేధించి అభ్యర్థిని చంపేశారా?

వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. మాంత్రికుడి హోదాలో అన్నారా? ఏపీకి డిప్యూటీ సీఎం హోదాలో అన్నారా? అంటూ ప్రశ్నించారు  పేర్నినాని. డిప్యూటీ సీఎం హోదాలో అంటే వెంటనే దేశంలోని శాస్త్రవేత్తలను రప్పించి కొబ్బరి చెట్లకు వచ్చిన వ్యాధి ఏంటో పరిశోధన చేయించి బతికించాలన్నారు. చేతబడి మాంత్రికుడిలా వారి దిష్టి తగిలిందని చెప్పడం సరికాదన్నారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నేతలు ఆలస్యంగా స్పందించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ నేతలు కొందరు మాట్లాడిన విషయాలను గుర్తు చేస్తున్నారు. దీనివెనుక వైసీపీ ప్రమేయం ఉందన్న వాదన సైతం లేకపోలేదు. ఇవాళ కాకపోయినా, రేపటి రోజైనా దీనివెనుక ఏం జరిగిందనేది తెలుస్తుందని అంటున్నారు.

 

 

 

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×