Dont trouble the trouble movie:థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే థియేటర్లలో సినిమా మిస్ అయిన చాలామంది ఓటీటీలో రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి చిత్రాలలో రాజమౌళి (Rajamouli ) తనయుడు కార్తికేయ (Karthikeya) ప్రొడ్యూసర్ గా మారి చేసిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. బాలయ్య డైలాగ్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది. మరి ఏ రోజున? ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆడియన్స్ ను అలరించబోతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇదివరకే ‘పుష్ప’ సినిమాలో షెకావత్ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా చేసిన చిత్రం ఇది. శశాంక్ యేలేటి దర్శకుడిగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇందులోని ఫాంటసీ ఎలిమెంట్స్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. మొత్తానికి అయితే థియేటర్లలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇటు ఓటీటీ ఆడియన్స్ ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.
also read:వెంకటేష్ కొడుకుగా నటించిన ఈ బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సూరి (ఫహద్ ఫాజిల్) చిన్నచిన్న మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు దివ్య (సారా పాలేకర్) అనే అమ్మాయి, ఆమె కుక్క స్నూపీ సూరికి ఎదురుపడతారు. సూరిని దివ్య ఒక మెజీషియన్ అనుకుంటుంది. సూరి మాత్రం దివ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పాపను కిడ్నాప్ చేశానని చెప్పి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతుంది. దివ్య తల్లిదండ్రులు అసలు కనిపించకుండా పోయారని సూరికి తెలుస్తుంది . దివ్య మామ ప్రతాప్ (సౌరభ్ సచ్ దేవా) మాత్రం సూరితో దివ్యని తన దగ్గరకు తీసుకొస్తే డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటాడు. ఇంతలో సూరికి అసలు ట్విస్ట్ తెలుస్తుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? సూరికి ఏం జరిగింది ? దివ్య అసలు కథ ఏంటి? చివరికి ఏం జరుగుతుందనేది మిగతా కథ.
ఇక ఈ సినిమాతో పాటు ఈ వీకెండ్ చాలా సినిమాలే ఓటీటీలోకి రాబోతున్నాయి. విజయ్ సేతుపతి బత్తా సినిమాతో పాటు సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సిగ్మా మూవీ తో పాటు మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయి . అలాగే అక్క, రుద్రవనం పిఎస్ వంటి సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి . మరి ఏ సినిమా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.