ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఏపీకి వెళ్తున్నారా? లేక ఏపీ ప్రజలు తెలంగాణకు వస్తున్నారో తెలుసుకోవాలన్నారు. అసలు తగిలితే ఏపీ వాళ్ల దిష్టే తెలంగాణకు తగులుతుందన్నారు జగదీష్ రెడ్డి.
అయ్యప్ప దీక్షలో ఉన్న ఎస్సైకి ఇచ్చిన మెమో వెనక్కు తీస్కోవాలి, అయ్యప్ప స్వాములకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ హెచ్చరించారు బీజేవైఎం నాయకులు. అడిషనల్ డీజీపీకి మెమోరాండం ఇచ్చిన బీజేవైఎం నాయకులు రేపటిలోగా ఎస్సైకి ఇచ్చిన మెమో ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త నిరసనలు చేస్తామన్నారు.
మంగళగిరిలోని కొండపనేని టౌన్ షిప్ లో 0.65 ఎకరాల విస్తీర్ణంలో పవర్ మెక్ ఫౌండేషన్ వారి సీఎస్ఆర్ నిధులు రూ.1.23 కోట్లతో నిర్మించిన పార్క్‌ను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం పార్కు అందాలను తిలకించిన మంత్రి లోకేశ్ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవని… అందుకే BRS నేతలు ఆ పార్టీకి దూరం అవుతున్నారని మండిపడ్డారు. కవిత కూడా అందువల్లే BRS వీడారని చెప్పారు. అహంకారం, బలుపు మాటలతో నాయకులు కాలేరన్నారు కడియం.
జగిత్యాల జిల్లా నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన చేశారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు మహిళలు. నీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్య తీర్చాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అధికారులను డిమాండ్ చేశారు.
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ముందు విచారణకు మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్న సిట్ బృందం.
మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 48 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. మొదటి విడత ఎన్నికలకు ఈనెల 29న నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ అని ఎన్నికల సంఘం ప్రకటించింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ పాఠశాలలో విద్యార్థులకు మిరాకిల్ ఆఫ్ మైండ్ ఆఫ్ ధ్యానం యోగ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ వరకు 365 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చంద్రబాబుపై.. జగన్ ప్రభుత్వం పెట్టిన ఫైబర్ గ్రిడ్ కేసు కథ కంచికి చేరింది. ఐదేళ్ల విచారణ తర్వాత, ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సాక్షాత్తూ సీఐడీనే తేల్చిచెప్పింది. దీంతో కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ను సబ్మిట్ చేసింది సీఐడీ. ఈ నేపథ్యంలో ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
కూకట్ పల్లిలో నల్ల చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు. కూల్చివేతలను అడ్డుకునే నేపథ్యంలో ప్రకాశ్ నగర్ వాసులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కాలనీవాసులను అదుపులోకి తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్న నీకోసం అనే ప్రోగ్రాం ఒక డ్రామా అని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పల్నాడులో మొక్కజొన్న గతంలో క్వింటా రూ.2,200 ఉంటే ఇప్పుడు రూ.1,600 కి పడిపోయిందని ఆరోపించారు. ఇన్పుట్ సబ్సిడీ లేదని.. సూపర్ సిక్స్, అన్నదాత సుఖీభవ, రాజధాని నిర్మాణం, పరిశ్రమలు ఒక డ్రామా మాత్రమేనని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపూర్, కూర్మపల్లి గ్రామాలు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. ఈ గ్రామాలు నిబంధనలకు విరుద్ధంగా చేశారని పలువురు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. కోర్టు కేసు కారణంగా రెండు సర్పంచ్‌లు, పదహారు వార్డు మెంబర్లకు ఎన్నికలను నిలివేశారు అధికారులు.
శ్రీ సత్యసాయి జిల్లా గరికిపల్లికి చెందిన నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్ దారుణ హత్యపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. బాలుడిని సొంత మేనమామే దారుణంగా హత్య చేశారన్నారు. అంగన్వాడి కేంద్రంలో ఉన్న హర్షవర్ధన్‌ను నిందితుడు ప్రసాద్ బైకుపై తీసుకువెళ్లి మరికొమ్మ దిన్నే సమీపంలో గొంతు నులిమి హత్య చేసి రోడ్డు పక్కనే పడేసినట్లు తెలిపారు.
కూకట్‌పల్లి నల్ల చెరువును హైడ్రా అద్భుతంగా పునరుద్ధరించిందని కొనియాడారు స్థానిక వాకర్స్. హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ స్థానిక వాకర్స్, ప్రజలు చెరువు వద్ద భారీ కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. చెరువు అభివృద్ధి, పునరుద్ధరణ అంటే ఏంటో హైడ్రా చేసి చూపించిందని, పటిష్టమైన బండ్, ఆహ్లాదకరమైన వాకింగ్ ట్రాక్ తమ ఆరోగ్యాన్ని పెంచుతున్నాయని వాకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
కడప జిల్లా కమలాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఎమ్మేల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు చైతన్యరెడ్డి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు టీవీకే చీఫ్ విజయ్ పార్టీకి మాజీ అన్నాడీఎంకే నేత కేఏ సెంగొట్టయన్ చేరికతో రాజకీయ బలం పెరిగింది. చెన్నైలోని టీవీకే కార్యాలయంలో విజయ్ ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు. 2026 ఎన్నికలకు ముందు టీవీకేను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సెంగొట్టయన్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నట్లు, టీవీకే అధికారంలోకి వస్తే సీఎం పదవి ఇస్తానని విజయ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికపై వివాదం రేగుతోంది. అది ట్రంప్ తయారుచేసింది కాదని.. రష్యా రచించిన డాక్యుమెంట్ అని వివిధ వర్గాలను ఉటంకిస్తూ రైటర్స్ వెలువరించిన కథనం కలకలం రేపుతోంది.
చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కున్నింగ్‌లోని లుయోయాంగ్ టౌన్ స్టేషన్ వద్ద రైలు.. ట్రాక్ ప్రాంతంలోకి ప్రవేశించిన కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది రైల్వే నిర్మాణ కార్మికులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ భావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హిందూ ప్రేక్షకులు నీ సినిమాలను ఆదరించకపోతే నువ్వెక్కడ నిలబడతావో ఒక్కసారి ఆలోచించు రాజమౌళి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని అన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ముఖ్యంగా భారత బ్యాటర్లు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం.. స్వీప్ షాట్లు సరిగా ఆడకపోవడం పెద్ద సమస్య అని అశ్విన్ తెలిపారు.