BigTV English
Advertisement

OG Fever: ఓం.. ఓజాస్ గంభీరాయనమః… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వైరల్ ఫీవర్

OG Fever: ఓం.. ఓజాస్ గంభీరాయనమః… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వైరల్ ఫీవర్

ఇటీవల కాలంలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినంత హైప్ ఇంకే సినిమాకీ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ మాటకొస్తే టీజర్, వీడియో సాంగ్, ట్రైలర్.. ఇలా ఓజీ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియా పూనకాలతో ఊగిపోయింది. ఎల్టీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ జానీ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఈస్థాయిలో హంగామా జరిగింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు చాలానే వచ్చినా ఈ స్థాయిలో పిచ్చెక్కిస్తోంది మాత్రం ఓజీనే. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, తెలుగు వారున్న ప్రతి ప్రాంతాన్ని కూడా ఓజీ ఫీవర్ వణికిస్తోంది.


తాజాగా ఓజీ సినిమా పోస్టర్ కి ఓ వీరాభిమాని పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓం ఓజాస్ గంభీరాయనమః అంటూ మంత్రాలు చదివి మరీ పవన్ పోస్టర్ కి పూజలు చేస్తున్నారు. ఫొటోకి ముందు పండ్లు, పూలు పెట్టి హారతులిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు సినిమా రిలీజ్ టైమ్ లో థియేటర్ల బయట ఎలాంటి హంగామా జరుగుతుందో ప్రేక్షకుల ఊహకే వదిలేయాల్సి ఉంటుంది.


వీరమల్లు – ఓజీ..
ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేదనే వాదన ఉంది. సినిమాలో గ్రాఫిక్స్ బాగో లేవని, డైరెక్టర్లు మారడం వల్ల, చాలా కాలంగా షూటింగ్ జరుపుకోవడం వల్ల.. ఆ ప్రభావమంతా సినిమాపై పడిందని అంటున్నారు. ఓజీ షూటింగ్ కూడా చాన్నాళ్లుగా జరిగింది. అయితే ఓజీకి మాస్ ఎలిమెంట్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. పంజా మూవీలో పవన్ ఇలాంటి పాత్ర చేసినా, ఇప్పుడు కేజీఎఫ్ జానర్ మొదలైన తర్వాత దాన్ని తలదన్నేలా ఓజీ వస్తుందని అభిమానులు అంటున్నారు. ఓజీలో పవన్ రెట్రో గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దానికి తగ్గట్టుగానే తమన్ మ్యూజిక్ సినిమాపై భారీ హైప్ పెంచింది.

ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేయకపోవచ్చని అంటున్నారు. పవన్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం చెప్పారు. ఆయన లెక్క ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ చివరిది కావచ్చు. ఒకవేళ కుదిరితే వీరమల్లు పార్ట్-2 ఏమైనా ఉండొచ్చేమో. సినిమాల తర్వాత పవన్ రాజకీయాలతో బిజీ అవుతారు, ఆలోగా ఎన్నికలు వస్తాయి. పూర్తిగా వాటిపై దృష్టి పెట్టాల్సిన సందర్భం. అందుకే పవన్ సినిమాలు ఇక తగ్గిపోతాయని అనుకోవాలి. అయితే ఓజీతో ఫుల్ మీల్స్ అని అంటున్నారు పవన్. సహజంగా పవన్ ఎప్పుడూ తన సినిమాల గురించి ఇంత హైప్ ఇచ్చి చెప్పరు. వీరమల్లు విషయంలో కూడా పవన్ లో ఇంత కాన్ఫిడెన్స్ కనపడలేదు. ఇప్పుడు ఓజీ విషయంలో మాత్రం పవన్ మంచి జోరుమీదున్నారు. అందుకే అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ కనపడుతున్నాయి. విడుదలకు ముందే ఓజీ సూపర్ హిట్ అని అంటున్నారు. ఎలాగూ బిజినెస్ బాగానే జరిగింది కాబట్టి, హిట్ టాక్ వస్తే కలెక్షన్లకు ఢోకా ఉండదనే చెప్పాలి.

Related News

Rahul Ravindran -Samantha: నాగచైతన్యతో సమంత విడాకులు… రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే?

Bhagya Shri -Ram Pothineni: నేను రొమాంటిక్ కాదు బాబోయ్.. రామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన భాగ్యశ్రీ!

Bro 2 Movie: బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం… పవన్ కళ్యాణ్ అనుమతే ఆలస్యమా?

Bhagya Shree Borse:  మేడమ్ ను ఫస్ట్ పట్టింది మేమే… భాగ్య శ్రీ పై రానా కామెంట్స్!

Rana Daggubati: మద్యం మత్తులో మాట్లాడలేదురా..రానాను ఆడేసుకున్న ఫ్యాన్స్!

Anasuya: అప్పుడు గుంపులో గొవిందా అన్నావ్‌.. మరి ఇప్పుడు చేసిందేంటి అనసూయ?

Chikiri – Chikiri song: పెద్ది చికిరి.. చికిరికి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ వైరల్!

Rahul Ravindran: మన్మథుడు 2 ప్లాప్.. నాగార్జున ఫోన్ చేసి అంత మాట అన్నారా?

Big Stories

×