Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నరసన్నపల్లికి చెందిన మహేష్(28) తనకు పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. తీవ్ర మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.